ఆంధ్రప్రదేశ్‌

ముచ్చటగా మూడుసార్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, మే 23: వైఎస్ కుటుంబం చేతిలో టీడీపీ ముచ్చటగా మూడుసార్లు పరాభవం పాలైంది. 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఏపీలో ఫ్యాన్ గాలి జోరుకు సైకిల్ కొట్టుకుపోవడంతో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుటుంబం చేతిలో చంద్రబాబుకు మూడవ ఓటమి తప్పనిసరైంది. 2004 సార్వత్రిక ఎన్నికల్లో రాజశేఖర్‌రెడ్డి చేతిలో ఘోర పరాజయం చవిచూసిన చంద్రబాబునాయుడు, 2009లోనూ వైఎస్ చేతిలో ఓటమిపాలయ్యారు. అయితే రాష్ట్రం విడిపోయిన అనంతరం 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు వైఎస్ జగన్‌పై స్పష్టమైన ఆధిక్యత కనబరిచి పార్టీని గెలిపించుకుని ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈ ఐదేళ్లలో చంద్రబాబు అనేక సంక్షేమ పథకాలు తెరమీదికి తెచ్చినా ఏ ఒక్కటీ టీడీపీని 2019 ఎన్నికల్లో విజయతీరాలకు చేర్చకపోగా చతికిలబడింది. ఏ పార్టీ నాయకుడు పాదయాత్ర చేస్తే ఆ పార్టీకి రాష్ట్ర ప్రజలు పట్టం కట్టారు. 2004 సార్వత్రిక ఎన్నికలకు ముందు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర చేసి ప్రజలకు చేరువయ్యారు. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి పార్టీ విజయానికి దోహదపడడంతో పాటు ప్రభుత్వాన్ని చేజిక్కించుకున్నారు.
కాగా 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి కూడా రాష్ట్రంలో సుదీర్ఘంగా పాదయాత్ర చేపట్టిన ఫలితమే నేడు ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడానికి కారణమైందని చెప్పవచ్చు. పాదయాత్రలో ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్న జగన్ తాను ప్రజలకు నవరత్నాలను అందిస్తానని ప్రకటించగా రాష్ట్ర ప్రజలు విశ్వసించి సాధికారంగా ఆహ్వానం పలికారు. జగన్ కోరుకున్నట్లుగానే ‘‘ఒక్క అవకాశం ఇవ్వండి’’ అన్న నినాదానికి రాష్ట్ర ప్రజలందరూ మూకుమ్మడిగా ఆమోదం తెలుపడం వల్లనే వైసీపీకి ఇంత భారీ మెజార్టీ సాధ్యమైందని చెప్పవచ్చు. ఈ ఎన్నికల్లో వైసీపీ అత్యధిక పార్లమెంటు, అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందడంతో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఓ కొత్త చరిత్రను సృష్టించారనే చెప్పాలి. తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ రాజన్న రాజ్యాన్ని రాష్ట్రంలో తీసుకువస్తానని ప్రజలకు హామీ ఇచ్చిన ఆ రాజన్న కుమారుడు ప్రజల అభిమానాన్ని చూరగొని భారీ మెజార్టీతో తాను గెలువడమేకాక రాష్ట్రంలో ఎన్నడూ, ఎప్పుడూ ఊహించని మెజార్టీ స్థానాలు సాధించడం కూడా విశేషం. ఎగ్జిట్ పోల్స్‌ను కాదని, ఎగ్జిట్ పోల్స్‌లో 110 నుంచి 130 స్థానాలు రావచ్చన్న ఊహాగానాలను సైతం అధిగమించడం గమనార్హం. మొత్తం మీద ఈ సార్వత్రిక ఎన్నికల ద్వారా రాజశేఖర్‌రెడ్డి కుటుంబం చంద్రబాబుపై ముచ్చటగా మూడవసారి గెలుపు సాధించి ప్రజలకు చేరువైంది.
చిత్రం... పులివెందులలో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్న వైకాపా శ్రేణులు