ఆంధ్రప్రదేశ్‌

జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ముందురోజే గవర్నర్, తెలంగాణ సీఎం కేసీఆర్ రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 25: ఈ నెల 30వ తేదీ విజయవాడలో జరగనున్న జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు 29వ తేదీ సాయంత్రానికే విజయవాడ విచ్చేస్తున్నారు. ఇంకా పలు రాష్ట్రాల ముఖ్యనేతలు కూడా తరలిరాబోతున్నారు. జగన్‌తోపాటు కనీసం పలువురు మంత్రులుగా అదే వేదికపై ప్రమాణం చేయబోతున్నారు. ఇక జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది ప్రజలు తరలిరానుండటంతో ఈ కార్యక్రమం సజావుగా సాగేందుకై అధికార యంత్రాంగం అప్రమత్తమయింది. భారీ ఎత్తున ప్రజానీకం తరలిరానుండటంతో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగే విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం లోపల వెలుపల, అదే విధంగా నగరంలోని వివిధ కూడలి ప్రాంతాల్లో ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రేతర ప్రాంతాల నుంచి ఎంత మంది వీవీఐపీలు, వీఐపీలు వస్తారనేది రెండు రోజుల్లో స్పష్టత వస్తుంది. వేదికకు సంబంధించిన బ్యాక్‌డ్రాప్, పబ్లిక్ అడ్రస్ స్టిసం వంటి ఏర్పాట్లను సమాచార శాఖ కమిషనర్ వెంకటేశ్వర్ చూస్తున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసే ముఖ్యఅతిథులు, మీడియా ప్రతినిధుకు ఐదు రకాల కేటగిరీ పాస్‌లను అందజేయబోతున్నారు. ఏలూరు వైపు నుంచి వచ్చే వాహనాలను రామవరప్పాడు సమీపంలోను, మచిలీపట్నం వైపు నుంచి వచ్చే వాహనాలను కానూరు వద్ద, హైదరాబాద్‌పై నుంచి వచ్చే వాహనాలను గొల్లపూడి వద్ద, గుంటూరు వైపు నుంచి వచ్చే వాహనాలను కాజ టోల్‌గేట్ సమీపంలోను పార్కింగ్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలాఉంటే డీజీపీ ఠాకూర్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు కరికాల వల్లవన్, నీరబ్‌కుమార్ ప్రసాద్, శాంతిభద్రతల అదనపు డీజీ రవిశంకర్, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ కుమార విశ్వజిత్, అగ్నిమాపక శాఖ డీజీ సత్యనారాయణ, కృష్ణా, గుంటూరు కలెక్టర్‌లు ఇంతియాజ్, కే శశిధర్, సీఆర్‌డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్, మున్సిపల్ కమిషనర్ ఎం రామారావు, కృష్ణా ఎస్పీ సర్వేశ్రేష్ఠ త్రిపాఠి తదితరులు శనివారం స్టేడియంను పరిశీలించారు.