ఆంధ్రప్రదేశ్‌

వైకాపా శాసనసభా పక్ష నేతగా జగన్ ఏకగ్రీవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 25: వైకాపా శాసనసభా పక్ష నేతగా ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాడేపల్లిలోని ఆయన నివాసంలో శనివారం ఉదయం 11.15 గంటలకు పార్టీ ఎమ్మెల్యేలతో జగన్ సమావేశమయ్యారు. ముందుగా ఇంటి ఆవరణలోని వైఎస్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తరువాత శాసనసభా పక్ష నేతగా ఎన్నుకునేందుకు వీలుగా పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఏకవాక్య తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దానిని పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు ధర్మాన ప్రసాదరావు, పీడిక రాజన్న దొర, కొలుసు పార్థసారథి, ఆళ్ల నాని, మహమ్మద్ ముస్త్ఫా, కోన రఘుపతి, కోలగట్ల వీరభద్రస్వామి, ముదునూరి ప్రసాదరాజు, విశ్వరూప్, రోజా బలపరిచారు. మిగిలిన ఎమ్మెల్యేలు ఆమోదించడంతో ఆయన శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం పార్టీ సీనియర్ నేతలు ధర్మాన, విజయసాయి రెడ్డి తదితరులతో కలిసి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. అక్కడ గవర్నర్‌ను కలిసి ఈ తీర్మానాన్ని అందచేయనున్నారు. ప్రభుత్వం ఏర్పాటు అవకాశం కల్పించాలని కోరుతూ, ఈ తీర్మాన ప్రతని ఇవ్వనున్నారు.
ఏపీ అసెంబ్లీ రద్దు చేస్తూ నోటిఫికేషన్
రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు గవర్నర్ నరసింహన్ పేరిట శనివారం నోటిఫికేషన్ విడుదల చేశారు.