ఆంధ్రప్రదేశ్‌

27న తత్కాల్ ప్రత్యేక రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 25: వేసవి సెలవుల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విజయవాడ మీదుగా కృష్ణరాజాపురం-్భవనేశ్వర్‌ల మీదుగా ఈనెల 27వ తేదీన తత్కాల్ ప్రత్యేక రైలు(నెంబర్ 06561)ను నడపనున్నారు. అలాగే భువనేశ్వర్ నుంచి కృష్ణరాజాపురానికి ఈనెల 29న ప్రత్యేక రైలు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వేశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 27వ తేదీన సాయంత్రం 4 గంటలకు కృష్ణరాజాపురం నుంచి బయలుదేరే ప్రత్యేక రైలు విజయవాడ మీదుగా 28న రాత్రి 7 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది. అలాగే రైలు (నెంబర్ 06562) భువనేశ్వర్-కృష్ణరాజాపురం ప్రత్యేక రైలు 29న ఉదయం 7.30 గంటలకు భువనేశ్వర్‌లో బయలుదేరి విజయవాడకు రాత్రి 8 గంటలకు చేరుకుంటుంది. అనంతరం 30వ తేదీన ఉదయం 10.15 గంటలకు కృష్ణరాజాపురం చేరుతుంది. ఈ రైళ్లు బంగారుపేట్, జోలార్‌పేట్, కాట్పాడి, రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, ఏలూరు, రాజమండ్రి, దువ్వాడ, విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, పలాసా, బరంపూర్, తురాడ రోడ్‌స్టేషన్ మార్గాల్లో ఈ రైళ్లు నడుస్తాయి.
తిరుపతి-కోల్‌కతా ప్రత్యేక రైలు
తిరుపతి-కోల్‌కతాల మధ్య ఆదివారం మధ్యాహ్నం 1.15గంటలకు తిరుపతిలో బయలుదేరి రాత్రి 7.30కు విజయవాడ మీదుగా రైలు(నెంబర్ 07587) 27 సాయంత్రం 5.40 గంటలకు కోల్‌కత్తా చేరుకుంటుంది. ఈ రైలు రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, సింహాచలం, విజయనగరం, పలాసా, కుర్దారోడ్డు, కటక్, భాద్రాత్, కల్కాపూర్, బాటానగర్ స్టేషన్ మీదుగా నడుస్తుందని దక్షిణమధ్య రైల్వే ఛీప్ పబ్లికేషన్ ఆఫీసర్ సీహెచ్ రాకేష్ ఒక ప్రకటనలో తెలిపారు.