ఆంధ్రప్రదేశ్‌

కరవుతో అల్లాడుతున్న రాయలసీమను ఆదుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మే 26: కొన్ని రోజులుగా ఎండ తీవ్రత పెరగటంతో రాయలసీమ జిల్లాల్లో తీవ్ర నీటి కొరత ఏర్పడిందని, దీనిపై ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోరారు. నీటి కొరతతో పశువులు సైతం మృత్యువాత పడుతున్నాయని ఆదివారం ఆయన ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని జిల్లాలతో పోలిస్తే రాయలసీమ జిల్లాల్లో కరవు పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని, ఆయా ప్రాంత రైతులు సకాలంలో వర్షాలు పడక అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి కరవు నుండి కాపాడాలని సూచించారు. సబ్సిడీ ధరలతో రైతులకు పశుగ్రాసాన్ని అందించాలని, సబ్సీడీ ధర కూడా చెల్లించలేని పేద రైతులకు ఉచిత గడ్డి కేం ద్రాలు రాయలసీమ జిల్లాల్లో మండలానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేయాలన్నారు. పశువుల తాగునీటి కోసం గతంలో మాదిరిగానే ప్రతి పంచాయతీలోనూ తాత్కాలిక నీటితొట్టెలను ఏర్పాటు చేయాలన్నారు. ఆయా శాఖల అధికారులు తక్షణమే నివేదిక తెప్పించుకుని రైతులకు వేసవిలో చెల్లించే వనరుల గురించి విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని కన్నా లక్ష్మీనారాయణ కోరారు.