ఆంధ్రప్రదేశ్‌

రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అద్దంకి, మార్చి 24: అద్దంకి-నార్కట్‌పల్లి రాష్ట్ర రహదారిపై ప్రకాశం జిల్లా అద్దంకి మండలం చినకొత్తపల్లి వద్ద గురువారం మధ్యాహ్నం జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వైద్యశాలకు తరలిస్తుండగా మరొకరు మృతిచెందాడు. నెల్లూరు జిల్లా బోగోలు మండలం సమీపంలోని జడ్‌పల్లికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారు వెంకటేశ్వరరెడ్డి(60), బుచ్చమ్మ(65), రమణమ్మ(45), జ్యోతి(40) కలిసి కారులో నకరేకల్లులో దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొని మధ్యాహ్నం తిరుగుప్రయాణంలో చినకొత్తపల్లి గ్రామం వద్ద కారు ముందు టైరు పంక్చరు కావడంతో వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. కారు పల్టీలు కొడుతుండగానే కారులో ప్రయాణిస్తున్న వారు తుళ్లిపోయారు. కారుప్రమాదాన్ని గమనించిన చినకొత్తపల్లి గ్రామస్థులు వెంటనే సహాయ చర్యలు చేపట్టినప్పటికి ఫలితం లేకపోయింది. 108వాహనానికి సమాచారం అందించి కారు డ్రైవరును రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ, దారిలోనే అతను కూడా మృతి చెందాడు. అతివేగం కారణంగానే ఘోర ప్రమాదం జరిగిందని గ్రామస్తులు అంటున్నారు. ఈఘటనలో కారులో ప్రయాణిస్తున్న వారు చిందరవందరగా తుళ్లిపోయి దుర్మరణం చెందారు. కారుడ్రైవరు ప్రాణాలతో ఉండడంతో 108వాహనంలో ఒంగోలుకు తరలిస్తుండగా దారి మధ్యలోనే అతను కూడా ప్రాణాలు విడిచాడు. ఈఘటనలో మొత్తం ఐదుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఘటన సమాచారం అందుకున్న దర్శి డిఎస్‌పి రాంబాబు, అద్దంకి ఎస్సై వెంకటేశ్వర్లు హుటాహుటిన ఘటనా స్ధలికి చేరుకొని, సెల్‌ఫోన్‌ల ఆధారంగా మృతుల కుటుంబీకులకు సమాచారం అందించారు. అద్దంకి పోలీసులు కేసు నమోదు చేసుకొని, మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.