ఆంధ్రప్రదేశ్‌

బిసిల సమస్యలపై మిలిటెంట్ ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 6: దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న బిసిల సమస్యల పరిష్కారం కోసం మిలిటెంట్ ఉద్యమం చేపట్టనున్నామని, ఇందుకు బిసిలంతా సిద్ధంగా ఉన్నారని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ప్రభుత్వానికి హెచ్చరించారు. విశాఖలో శనివారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగు దశాబ్దాలుగా బిసిలు అనేక రకాలైన సమస్యలను ఎదుర్కొంటున్నారని, ఈ సమస్యలపై త్వరలో దశలవారీగా ఆందోళనలకు దిగుతామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా రాస్తారోకోలు, ధర్నాలు, ర్యాలీలుంటాయని వివరించారు. చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని, రాజ్యాంగాన్ని సవరించి బిసి ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో మెజారిటీ ప్రజల కోసం అభివృద్ధి, మానవ హక్కుల కోసం ఒకసారీ రాజ్యాంగాన్ని సవరించకపోవడం దురదృష్టకరమన్నారు. 20వేల కోట్ల రూ.లు కేటాయించి బిసి సబ్ ప్లాన్‌ను అమలు చేయాలని, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విధానాలను స్ఫూర్తిగా తీసుకుని పూర్తిస్థాయిలో ఈ సౌకర్యం విద్యార్థులకు కల్పించాల్సిందిగా డిమాండ్ చేశారు.