ఆంధ్రప్రదేశ్‌

ఆర్టీసీ యాజమాన్యంతో అసంపూర్తిగా ముగిసిన జేఏసీ చర్చలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 10: ఏపీఎస్ ఆర్టీసీ కార్మిక సంఘాలు తమ అపరిష్కృత డిమాండ్ల సాధనకై ఈ నెల 13వ తేదీ నుంచి చేపట్టనున్న నిరవధిక సమ్మెకు ఓ వైపు కౌంట్‌డౌన్ ఆరంభం కాగా మరో వైపు యాజమాన్యం, కార్మిక సంఘాల మధ్య జరుగుతున్న చర్చల్లో పురోగతి కన్పించలేదు. సంస్థ ఎండీ ఎన్‌వీ సురేంద్రబాబు సెలవులో ఉన్న కారణంతో రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు ఈ నెల 8వ తేదీ జేఏసీ నేతలతో సమావేశమై ప్రధానంగా ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై స్పష్టమైన హామీనిచ్చి మరికొన్ని డిమాండ్లపై సానుకూల వైఖరి చూపారు. సోమవారం సంస్థ ఎండీ ఎన్‌వీ సురేంద్రబాబు సారథ్యంలో ఆర్టీసీ హౌస్‌లో జరిగిన చర్చలు మాత్రం అసంపూర్తిగానే ముగిశాయి.
కొన్ని డిమాండ్ల పరిష్కారానికి సురేంద్రబాబు తక్షణ ఆమోదం తెలిపారు. మరికొన్నింటిని వాయిదా వేయడంతో స్పష్టత రాని అంశాలపై మంగళవారం మరోమారు చర్చలు జరిపి అన్ని అంశాలు పరిష్కారమైన తరువాతే సమ్మె విరమణపై స్పష్టత ఇస్తామని జేఏసీ కన్వీనర్, గుర్తింపు సంఘం ఎంప్లారుూస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన చర్చల సారాంశాన్ని లిఖిత పూర్వకంగా ఇవ్వాలని అప్పుడు మాత్రమే సమ్మె విరమణపై తమ నిర్ణయాన్ని నేరుగా ముఖ్యమంత్రిని కలిసి తెలియజేస్తామన్నారు. కారుణ్య నియామకాలు ఈ నెలలో చేపట్టేందుకు, మిగిలిన కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి తీసుకుని, 240 రోజులు సర్వీస్ పూర్తయి రెగ్యులర్ కాని కాంట్రాక్ట్ కండక్టర్‌లు, డ్రైవర్లను ఈ నెలలో రెగ్యులర్ చేసేందుకు అంగీకారం కుదిరింది. మెడికల్ బిల్లుల చెల్లింపులోనూ, వేతనాల్లో తేడాలను సరి చేసేందుకు, డిజిటల్ బోర్డులను కార్మిక సంఘాలు కోరిన విధంగా వేసేందుకు, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్న వారికి రిఫరల్ ఆసుపత్రుల్లో చెల్లించే విధంగా బిల్లుల చెల్లింపునకు అంగీకారం కుదిరింది. ఆన్ డ్యూటీలో ప్రమాదానికి గురై అన్‌ఫిట్ అయిన వారికి ప్రత్యామ్నాయ ఉద్యోగం, అలవెన్స్‌లు పెంపు, జీపీఆర్‌ఎస్ ద్వారా రన్నింగ్ టైం సరి చేసేందుకు సురేంద్రబాబు సానుకూలత వ్యక్తం చేశారు. అయితే సిబ్బంది కుదింపు ఆలోచన ఉపసంహరణ, అన్ని కేటగిరీల్లో పదోన్నతులు, కొన్ని దశాబ్దాలుగా కార్మిక సంఘాలు పొందుతున్న సౌకర్యాల కొనసాగింపు, అద్దె బస్సుల పెంపుదల, డబుల్ డ్యూటీలకు డబుల్ వేతనాల చెల్లింపు, పెండింగ్‌లో ఉన్న సీసీఎస్ రుణాలు తక్షణం విడుదల, కార్మికుని భార్య లేదా భర్తకు ఉచిత ప్రయాణ సౌకర్యం లాంటి డిమాండ్లపై చర్చలు వాయిదా పడ్డాయి. నేటి చర్చల్లో యాజమాన్యం తరపున సురేంద్రబాబుతోపాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఏ కోటేశ్వరరావు, కేవీఆర్‌కే ప్రసాద్, పిన్నమనేని వెంకటేశ్వరరావు, ఫైనాన్స్ సలహాదారు రాఘవేంద్ర, చీఫ్ పర్సనల్ మేనేజర్ బొట్టు చిట్టిబాబు, జేఏసీ తరపున కన్వీనర్ పలిశెట్టి దామోదరరావు, కో కన్వీనర్లు సీహెచ్ సుందరయ్య, వీ వరహాల నాయుడు, వైవీ రావు, ఎం హనుమంతరావు, వీ శివప్రసాదరావు పాల్గొన్నారు.
ఆర్టీసీ కార్మికవర్గాల్లో హర్షాతిరేకం
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కీలక నిర్ణయం తీసుకోవటంపై ఉద్యోగ, కార్మికవర్గాల్లో సర్వత్రా హర్షాతిరేకం వ్యక్తమవుతోంది. అయితే దీనిపై అధ్యయన కమిటీ ఏర్పాటు వల్ల ఎంతకాలం ఎదురుచూడాల్సి వస్తుందోననే ఆందోళన కూడా అందరిలో నెలకొంది.