ఆంధ్రప్రదేశ్‌

మంత్రులకు చాంబర్ల కేటాయింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 10: రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి చాంబర్లను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రులు తమకు ఇష్టమైన చాంబర్లు తీసుకునేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆ ఒత్తిళ్లకు తలొగ్గకుండా, గతంలో ఆయా శాఖల మంత్రులకు కేటాయించిన చాంబర్లనే కేటాయించారు. మంత్రుల బంధువులు, తదితరులు ఆయా చాంబర్లను చూసి తమకు అవసరమైన మార్పులు చేర్పులు చేయిస్తున్నారు.

పేరు శాఖ బ్లాక్/గది నెం.
*
పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) 2/215
కె.కన్నబాబు వ్యవసాయం 2/208
బొత్స సత్యనారాయణ పురపాలక 2/135
వెల్లంపల్లి శ్రీనివాసరావు దేవాదాయ 2/137
ఎం.సుచరిత ఉప ముఖ్యమంత్రి (హోం) 2/136
బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంధన, అటవీ 2/211
బుగ్గన రాజేంద్రనాథ్ ఆర్థిక 2/212
పుష్పశ్రీవాణి ఉప ముఖ్యమంత్రి 3/203
అంజాద్ బాషా ఉప ముఖ్యమంత్రి 3/212
ముత్తంశెట్టి శ్రీనివాసరావు పర్యాటక 3/210
పినిపి విశ్వరూప్ సాంఘిక సంక్షేమం 3/211
జి.జయరాం కార్మిక, ఉపాధి 3/207
కె.నారాయణ స్వామి ఎక్సైజ్ 4/127
సిహెచ్. శ్రీరంగనాథ రాజు గృహ నిర్మాణం 4/211
కొడాలి శ్రీవెంకటేశ్వరరావు పౌరసరఫరాలు 4/130
మోపిదేవి వెంకట రమణ మత్స్య, పశుసంవర్థక 4/132
ఆదిమూలం సురేష్ విద్య 4/210
పి. అనిల్ కుమార్ జలవనరులు 4/212
మేకపాటి గౌతం రెడ్డి పరిశ్రమలు 4/208
ఎం. శంకరనారాయణ బీసీ సంక్షేమం 4/131
ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ ఉప ముఖ్యమంత్రి 5/191
ధర్మాన కృష్ణదాస్ రహదారులు, భవనాలు 5/193
పేర్ని వెంకటరామయ్య రవాణా, పౌరసంబంధాలు 5/211
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పంచాయతీరాజ్ 5/188
తానేటి వనిత మహిళా, శిశు సంక్షేమం 5/210