ఆంధ్రప్రదేశ్‌

టీటీడీ పాలకవర్గంలో ‘భక్తులకు మాత్రమే స్థానం కల్పించాలి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 10: టీటీడీ పాలకవర్గంలో దేవాలయం పట్ల అవగాహన, స్వామి పట్ల అచంచలమైన భక్తి, విశ్వాసం ఉన్న భక్తులకే స్థానం కల్పించాలనేది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హైందవులు ముఖ్యంగా తెలుగు వారి ఆకాంక్ష అని గురు కొండవీటి జ్యోతిర్మయి సెంట్రల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, అమ్మ కొండవీటి జ్యోతిర్మయి అన్నారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేద్దామని తాను నాలుగుసార్లు ప్రయత్నించినా ఫలించలేదన్నారు. టీటీడీ ప్రాశాస్త్యం పెంపునకు తన వద్ద బృహత్తర ప్రణాళిక ఉందని, దాన్ని అమలు చేయగల్గితే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి ప్రజల్లో మంచిపేరు వస్తుందన్నారు. ప్రజల మనోభావాలను గుర్తెరిగి మంత్రివర్గ నిర్మాణం ఏలా చేపట్టారో అలాగే అన్ని దేవాలయాల పాలకమండళ్లలో భక్తులకే స్థానం కల్పించాలన్నారు. గత ప్రభుత్వం తన స్వప్రయోజనాలకు దేవాలయాలను వినియోగించుకోవటం వల్లనే ప్రజలు ఆ ప్రభుత్వాన్ని తిరస్కరించారన్నారు. విశాఖ శారదాపీఠం స్వామి నుంచి వివిధ హైందవ పీఠాధిపతులు, హైందవ సంస్థలు, సామాన్య భక్తుల ఆలోచన కూడా ఇదేనన్నారు.