ఆంధ్రప్రదేశ్‌

ఇన్‌పుట్ సబ్సిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 10: గత ప్రభుత్వం 2014-18 వరకు రూ 2వేల కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని చెల్లించాల్సి ఉంది. రైతులు నష్టపోకుండా తక్షణమే రైతులకు చెల్లించేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. గిట్టుబాటు ధరను సీజన్ ప్రారంభంలోనే ప్రకటిస్తారు. మార్కెట్ ధర ప్రకారం గిట్టుబాటు ధర ఉండేలా చర్యలు చేపట్టాలని మంత్రిమండలి నిర్ణయించింది. ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధికి రూ. 2వేల కోట్లు కేటాయించాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో నియోజకవర్గంలో ప్రాథాన్యతా క్రమంలో రిగ్‌లు అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో ఉచిత బోర్లు వేసేందుకు ముందుగా 200 రిగ్‌లు కొనుగోలు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ సీజన్‌లో ధాన్యానికి కనీస మద్దతు ధర రావటం లేదనే ఆరోపణలు కేబినెట్ దృష్టికి రావటంతో ఈ సమస్యను వెంటనే పరిష్కరించి మద్దతుధర అందేలా చర్యలు తీసుకోవాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇంకా రైతులకు నూరు శాతం బీమా చెల్లించేందుకు సమావేశం సుముఖత వ్యక్తం చేసింది. క్లెయిమ్ బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుంది. రైతులకు ఎలాంటి భారం పడకూడదని నిర్ణయించింది. రైతులకు లబ్ది చేకూర్చే వరకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని సీఎం ఆదేశించారు.