ఆంధ్రప్రదేశ్‌

విపక్షాల అనైక్యత వల్లనే బీజేపీ విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 10: దేశంలో విపక్షాల అనైక్యత వల్లనే భారతీయ జనతా పార్టీ విజయం సాధించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పేర్కొన్నారు. సోమవారం గుంటూరులోని సీపీఐ కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ అధ్యక్షతన జరిగింది.
అనంతరం విలేఖర్లతో రామకృష్ణ మాట్లాడుతూ 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేక పోయిన బీజేపీకి ఇటీవల ఎన్నికల ఫలితాల్లో 303 సీట్లు వస్తాయని ఎవరూ ఊహించలేదన్నారు. అయితే విపక్షాలు దేశవ్యాప్తంగా కలిసి పోటీ చేయక పోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. బీజేపీ మాత్రం అనేక పార్టీలతో పొత్తులు పెట్టుకుని పోటీ చేసిందన్నారు. దేశవ్యాప్తంగా వామపక్షాలు, కాంగ్రెస్ ఇతర పార్టీలు అన్నీ కలిసి పోటీ చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. విపక్షాలు కేవలం బీజేపీ మతోన్మాదంపై మాత్రమే ప్రచారం చేశాయని, మోదీ, అమిత్‌షాలు జాతీయ వాదాన్ని రెచ్చగొడుతూ ఎన్నికల సంఘాన్ని గుప్పెట్లో పెట్టుకుని ఇష్టానుసారంగా వ్యవహరించారన్నారు. దాన్ని తిప్పికొట్టడంలో విపక్షాలు విఫలం కావడం మరో కారణమన్నారు. ఏపీలో జనసేన, సీపీఐ, సీపీఎం, బీఎస్‌పి కలిసి ప్రజల్లోకి వెళ్లక పోవడం వల్లనే ఓటమి చెందామని విశే్లషించారు. పవన్‌కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక్కటేనన్న సంకేతం ప్రజల్లోకి బలంగా వెళ్లిందని, దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ పూర్తిగా వైసీపీ కైవసం చేసుకోవడంతో అనూహ్యంగా 151 అసెంబ్లీ సీట్లు వైసీపీ గెలిచి అధికారంలోకి వచ్చిందన్నారు. ఈ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీకి జరిగిన నష్టంపై త్వరలో జాతీయ, రాష్టస్థ్రాయిలో పార్టీ నాయకత్వంతో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. రైతులకు సంబంధించి గత ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీని దశలవారీగా విడుదల చేయాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, జెవివి సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.