ఆంధ్రప్రదేశ్‌

సీపీఎస్‌పై మంత్రివర్గ నిర్ణయంపై మిశ్రమ స్పందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 10: కంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దు విషయమై న్యాయ, సాంకేతికపరమైన అంశాలపై లోతుగా అధ్యయనం చేసేందుకు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చైర్మన్‌గా పలువురు కార్యదర్శులతో కమిటీ ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం తీసుకున్న నిర్ణయమై ఉద్యోగ వర్గాల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా సీపీఎస్ రద్దుపై తొలి సమావేశంలోనే కీలకనిర్ణయం తీసుకోవటంలో వారిలో కొంత మోదం, కొంత ఖేదం వ్యక్తమవుతోంది. త్వరితగతిన ఆ కమిటీ నివేదిక తెల్పించుకుని సీపీఎస్‌ను రద్దు చేయాలని సీపీఎస్ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పీ రామాంజనేయులు యాదవ్ డిమాండ్ చేశారు. లక్షా, 76 వేల మంది ఉద్యోగులు ముక్తకంఠంతో సీపీఎస్ రద్దును కోరుకుంటున్నారని అన్నారు. ఎన్నికల హామీలను దృష్టిలో ఉంచుకుని జగన్ ఉద్యోగుల విషయంలో ప్రధానమైన నిర్ణయాలు తీసుకున్నారంటూ ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి టీవీ ఫణిపేర్రాజు ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. పేరి విజన్ కమిటీ తన నివేదికను సమర్పించడానికి ఇంకా కొంత సమయం పడుతున్న నేపథ్యంలో నాడు 27 శాతం మధ్యంతర భృతిని ప్రకటించారని అన్నారు. సీపీఎస్ రద్దుకు సూత్రప్రాయంగా అంగీకరించారని అన్నారు.
ఉపాధ్యాయ సంఘాలు హర్షం
సీపీఎస్ రద్దుకై తొలి మంత్రివర్గ సమావేశం కీలక నిర్ణయం తీసుకోవడంపై ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి హర్షం వెలిబుచ్చారు. సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయం దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఓ దిక్సూచి లాంటిదని అన్నారు. ఈ విషయంలో దేశానికే ఆదర్శంగా నిలిచారని అన్నారు.