ఆంధ్రప్రదేశ్‌

రికార్డు ఎండలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, మార్చి 24: రాయలసీమ జిల్లాల్లో గడచిన నాలుగైదు రోజులుగా కనీవిని ఎరుగని రీతిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అనంతపురం జిల్లాలో 11 సంవత్సరాల క్రితం, కర్నూలు జిల్లాలో 50 ఏళ్ల క్రితం, కడప జిల్లాలో 110 ఏళ్ల క్రితం నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతల రికార్డులను గడచిన వారం రోజులుగా నమోదైన రికార్డులు బద్దలు చేశాయి.
అనంతపురం జిల్లాలో భారత వాతావరణ సంస్థ(ఐఎండి) 1910వ సంవత్సరంలో అబ్జర్వేటరీని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచీ నమోదు చేసిన ఉష్ణోగ్రతల రికార్డుల ప్రకారం 2005 మే 20వ తేదీ జిల్లాలో అత్యధికంగా 44.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇక మార్చి నెలలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతను పరిశీలిస్తే 2007 మార్చి 25వ తేదీ అత్యధికంగా 41.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లాలో 1980 నుంచీ వ్యవసాయ పరిశోధనా కేంద్రం రికార్డుల ప్రకారం చూసినా 2005 మే 22వ తేదీ అత్యధికంగా 44.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇలా భారత వాతావరణ సంస్థ, వ్యవసాయ పరిశోధన కేంద్రాలు 1910, 1980ల నుంచి నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలను నమోదు చేశాయి. అప్పటి నుంచీ ఇప్పటివరకూ ఆ ఉష్ణోగ్రతలే అత్యధికమని అధికారులు పేర్కొంటున్నారు. తాజాగా మార్చి 21వ తేదీ అత్యధికంగా శింగనమల మండలం తరిమెల గ్రామంలో ఏర్పాటుచేసిన ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ (ఎడబ్ల్యుఎస్)లో 45.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదై పాత రికార్డులను తిరగరాసింది. అనంతపురం జిల్లాలో ప్రతి రోజూ 119 ఆటోమేటిక్ వెదర్ స్టేషన్‌ల ద్వారా ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారం తెలుసుకునే వీలు ఉంది. ఇలా జిల్లాలోని 119 ఎడబ్ల్యుఎస్‌లలో సుమారుగా 80 శాతం పైగా కేంద్రాల్లో 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఇక కర్నూలు జిల్లాలో భారత వాతావరణ సంస్థ 1883 నుంచీ అబ్జర్వేటరీని ఏర్పాటు చేయగా అది అప్పటి నుంచీ ఎప్పటికప్పుడు ఉష్ణోగ్రతలను నమోదు చేస్తూ ఉంది. దీని ప్రకారం జిల్లాలో అత్యధికంగా 1996 మార్చి 29వ తేదీ 43.3 డిగ్రీల సెల్సియస్ ఆల్‌టైమ్ రికార్డుగా నమోదైంది. ఇక 1921 మే 10వ తేదీ కర్నూలు జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాగా 1966 నుంచి ఉన్న వ్యవసాయ పరిశోధన స్థానం (ఎడబ్ల్యుఎస్) నంద్యాలలో 1998 జూన్ 2వ తేదీ అత్యధికంగా 48.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత ఇప్పటివరకూ అలాంటి ఉష్ణోగ్రతలు జిల్లాలో ఎక్కడా నమోదు కాకపోగా తాజాగా 2016 మార్చి 23వ తేదీ ఆత్మకూరు మండలంలోని ఎడబ్ల్యుఎస్‌లో 48.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదై పాత రికార్డులను తిరగరాసింది.
కడప జిల్లాలో భారత వాతావరణ సంస్థ ఏర్పాటుచేసిన కేంద్రంలో 1906 మే 18వ తేదీ మాత్రమే అత్యధికంగా 46.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు రికార్డులు వెల్లడిస్తుండగా అప్పటి నుంచీ ఇప్పటివరకూ ఆ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కాలేదు. అయితే తాజాగా రెండు మూడు రోజుల నుంచీ కడప జిల్లాలోని చిట్వేలు, రాజుపాలెం, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు జిల్లాల్లో 46 డిగ్రీల సెల్సియస్ పైబడి ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం.
మరో మూడు రోజులు ఇదే పరిస్థితి..
అనంతపురం జిల్లాలో మరో మూడు రోజుల పాటు ఇదే రకమైన వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని వ్యవసాయ, వాతావరణ విభాగం శాస్తవ్రేత్త డాక్టర్ ఎస్‌ఎన్ మల్లీశ్వరి తెలిపారు. గడచిన మూడు నాలుగు రోజులుగా రాయలసీమ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయన్నారు. మరో మూడు రోజుల పాటు ఇదే రకమైన పరిస్థితి కొనసాగడంతో పాటు ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కనిపించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు.