ఆంధ్రప్రదేశ్‌

ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టపరచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 10: ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎక్కడా ఎలాంటి లోటుపాట్లకు ఆస్కారం లేకుండా చూడాలంటూ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) ఆ శాఖ అధికారులను ఆదేశించారు. జగన్ ప్రభుత్వంలో అవినీతి రహిత పాలనకు అవకాశం లభించిందని, అందుకనుగుణంగానే అధికారులు వ్యవహరించాలన్నారు. మంత్రివర్గ తొలి సమావేశంలో పాల్గొన్న అనంతరం మంత్రి నాని విజయవాడ ప్రభుత్వ అతిథిగృహంలో అధికారులతో సమావేశమై ప్రాథమికంగా తొలి సమీక్ష నిర్వహించారు. ప్రజా పంపిణీ వ్యవస్థలోనున్న లోటుపాట్లను అధిగమిస్తూ తమ ప్రభుత్వం విభిన్న కార్యక్రమాలకు రూపకల్పన చేయనున్నదని అన్నారు. సీఎం ఆదేశాల మేర రానున్న రోజుల్లో బియ్యం, పప్పులు నేరుగా లబ్ధిదారుని ఇంటికి చేర్చుతామని ప్రజలకు ఏ మాత్రం ఇబ్బంది లేని విధంగా అన్ని విధానాలపై ప్రభుత్వం లోతుగా సమీలోచన చేస్తున్నదన్నారు. అధికారులు ఎవరైనా ఏ అంశంపై అయినా తనతో నేరుగా మాట్లాడవచ్చని ప్రతి ఒక్కరి ఆలోచనలు ఆకాంక్షలకు అనుగుణంగానే తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ఈ సమీక్షలో పౌర సరఫరాల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సూర్యకుమారి, డైరెక్టర్ సునీత, తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఉద్యోగుల సంఘ నేతలు మంత్రిని కలిసి అభినందనలు తెలిపారు.