ఆంధ్రప్రదేశ్‌

పది రోజులు కాలేదు.. అప్పుడే విమర్శలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), జూన్ 11: నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పదవి చేపట్టి పట్టుమని పదిరోజులు గడవక ముందే చంద్రబాబునాయుడు విమర్శించడం తగదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అభిప్రాయపడ్డారు. తన ఐదేళ్ల పాలనలో ఏ ఒక్క హామీని నెరవేర్చని చంద్రబాబు, రాష్ట్రాన్ని నిలువునా దోచుకున్నారని, ప్రాజెక్టుల్లో జరుగుతున్న అవినీతిని కాగ్ సైతం తప్పుబట్టిందన్నారు. చేసిన తప్పులపై ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం ప్రస్తుతం చంద్రబాబుకు వచ్చిందన్నారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఉమ్మారెడ్డి మాట్లాడుతూ మొదటి క్యాబినెట్ సమావేశంలో మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందన్నారు. అధికారం చేపట్టిన తరువాత భవిష్యత్తు కార్యాచరణపై మంత్రులు, అధికారులకు జగన్ దిశానిర్దేశం చేశారన్నారు.
తమ కష్టాలు తీర్చే నేతగా జగన్‌ను ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు చూస్తుంటే పంథా మార్చుకోని చంద్రబాబు విమర్శలు చేయడం దారుణమన్నారు. తాము ప్రారంభించిన అభివృద్ధిని ఆపొద్దు అని బాబు అంటుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో మంత్రివర్గ సమావేశం పెట్టి తనకు కావాల్సిన బిల్లులకు చంద్రబాబు చెల్లింపులు చేయలేదా అన్నారు. ఎన్టీఆర్ తరువాత రాయలసీమలో ప్రాజెక్టులను చెపట్టింది వైఎస్ మాత్రమేనన్నారు. చంద్రబాబు హయాంలో ప్రాజెక్టుల అంచనా వ్యయాలు మాత్రం పెంచారని, దానిపై జగన్ సమీక్షలు నిర్వహిస్తుంటే బాబు ఉలిక్కిపడుతున్నారన్నారు. బాబు 87వేల కోట్ల రైతు రుణాలను 24 వేల కోట్ల రూపాయలకు కుదించి, ఆ కాస్త రుణమాఫీ కూడా సరిగా చేయలేదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయకుండా ఇప్పుడు కొత్త ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం దారుణమన్నారు. టీడీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయంటున్న బాబు, గతంలో వైసీపీ కార్యకర్తలపై జరిగిన దాడులపై ఏనాడైనా విచారణ జరిపించారా అని ఉమ్మారెడ్డి ప్రశ్నించారు. ఇప్పటి సీఎం జగన్‌పై హత్యాయత్నం జరిగితే కోడికత్తి అంటూ అవహేళనగా మాట్లాడారని గుర్తు చేశారు.
పోలవరం పేరు ఎత్తితే బాబు కలవరపడుతున్నారని, పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కాగ్ సైతం తేల్చి చెప్పిందన్నారు. కరకట్ట వద్ద అక్రమకట్టడాలు ఉన్నా అదే ప్రాంతంలో ప్రజావేదికను నిర్మించారన్నారు. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఇసుక తవ్వకాలపై వైసీపీ ఎన్నో సార్లు ఆందోళన చేసినా నాడు బాబులో చలనం లేదన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 100 కోట్ల రూపాయల జరిమానా విధించిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. ప్రజావేదికను తనకు కేటాయించాలని బాబు కోరడం దుస్సాహసమేనన్నారు. నదీతీరంలో ఉన్న అక్రమ కట్టడాలపై జగన్ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఉమ్మారెడ్డి స్పష్టం చేశారు.

చిత్రం... విలేఖరులతో మాట్లాడుతున్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు