ఆంధ్రప్రదేశ్‌

సినారె ప్రసంగాలు స్ఫూర్తిదాయకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 11: జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత, దివంగత రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సీ నారాయణరెడ్డి ప్రసంగాల సంకలనం భావితరాలకు స్ఫూర్తి దాయకమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రస్తుతించారు. నారాయణరెడ్డి ప్రసంగాలపై రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ సేకరించి సంకలనం చేసిన ‘పెద్దల సభలో తెలుగుపెద్ద’ పుస్తకాన్ని తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అధ్యక్షత వహించారు. ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ మాట్లాడుతూ తన చేతుల మీదుగా సినారె ప్రసంగాల పుస్తక సంకలనం ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. జస్టిస్ చలమేశ్వర్ గత 45 సంవత్సరాలుగా సినారెతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
ఇందిరా పార్క్‌లో మార్నింగ్ వాక్ చేసే రోజుల్లో సినారె కవితల ప్రథమ శ్రోతను తానే అన్నారు. జ్ఞాన్‌పీఠ్ అవార్డు పొందిన తెలుగు వారిలో మొదటి వ్యక్తి విశ్వనాథ సత్యనారాయణ కాగా మరో వ్యక్తి సినారె అన్నారు. జాతీయ జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్ జస్టిస్ రఘురాం ముఖ్యఅతిథిగా ప్రసంగిస్తూ ముఖ్యమంత్రిగా జగన్‌కు రాష్ట్ర ప్రజలు గొప్ప విజయాన్ని అందించారని, అందుకు తగిన సవాళ్లు కూడా ఉంటాయన్నారు. వాటిని అధిగమించే శక్తి జగన్‌కు ఉందన్నారు. కాగా పార్లమెంట్‌లో అనేక అనుభవాలను, దృశ్యాలను, సంఘటనలను వివరించిన డాక్టర్ సినారె ప్రసంగాలను సంకలనం చేయడం ఆనందంగా ఉందని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. రైతునేస్తం పబ్లికేషన్స్ ప్రతినిధి డాక్టర్ యడవల్లి వెంకటేశ్వర్ సంధానకర్తగా వ్యవహరించారు.
చిత్రం... పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి