ఆంధ్రప్రదేశ్‌

ఐటీ కంపెనీలు రావంటున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 11: రాష్ట్రంలో అధికార మార్పిడి జరగడంతో ఐటీ కంపెనీలు రావంటున్నారని, ఏం చేయాలో అర్థం కావడం లేదంటూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వద్ద ఒక యువతి తన బాధను విన్నవించుకుంది.
ఉండవల్లి ప్రజావేదిక వద్ద చంద్రబాబును కలిసేందుకు ప్రకాశం, గుంటూరు, విజయనగరం, కృష్ణా జిల్లాల నుంచి ప్రజలు, మహిళలు, విద్యార్థులు వచ్చారు. ఈ సందర్భంగా గుంటూరుకు చెందిన చందన మాట్లాడుతూ తాను బీటెక్ పూర్తి చేశానని, ఇక్కడే సెటిల్ అవుదామని అనుకున్నానని తెలిపింది. ఇప్పుడు టీడీపీ ఓడిపోవటంతో రాష్ట్రానికి ఐటీ కంపెనీలు రావంటున్నారని, వచ్చినవి కూడా వెళ్లిపోతాయని అంటున్నారని, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదని వాపోయింది.
రైతు రుణమాఫీ 4, 5 కిస్తీ డబ్బులు ఇక బ్యాంక్ ఖాతాలో పడవని అంటున్నారని, పేద రైతులంతా దానిమీదే ఆశలు పెట్టుకున్నామని రైతులు తెలిపారు. ఏలాగైనా న్యాయం చేయాలని కోరారు. పెరిగిన భూముల ధరలు మళ్లీ పడిపోయాయని, తమ తరువాతి తరాలకైనా భూమికి మంచి రేటు వచ్చేలా చూడాలని కోరారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ, జరిగింది తలచుకుని బాధపడకూడదని, భవిష్యత్తువైపు సాగిపోవాలన్నారు. విద్యార్థులు బాగా చదువుకోవాలని, తల్లితండ్రులకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

చిత్రాలు.. చంద్రబాబును కలిసేందుకు వచ్చిన ప్రజలు,
*బాధపడుతున్న రైతును ఓదారుస్తున్న మాజీ సీఎం