ఆంధ్రప్రదేశ్‌

తిరుమలలో తగ్గని రద్దీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 11: వేసవి సెలవులు, విద్యార్థుల పరీక్షా ఫలితాలు వెల్లడవుతున్న తరుణంలో తిరుమలకు వచ్చే భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంది. సోమవారం 88,173 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మంగళవారం కూడా రద్దీ కొనసాగుతోంది. దీంతో సర్వదర్శనానికి వెళ్లే భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్ పూర్తిగా నిండిపోయి సుమారు రెండు కిలోమీటర్లు మేర భక్తులు స్వామి దర్శనం కోసం బారులు తీరివున్నారు. కాగా మంగళవారం 37,036 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. భక్తులు హుండీలో సమర్పించిన కానుకల ద్వారా రూ. 2.61 కోట్లు ఆదాయం లభించింది. ఉదయం 5 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 60వేలకు మందికి పైగా భక్తులు స్వామిని దర్శించుకున్నారు. మరో 30వేల మంది స్వామి దర్శనం కోసం వేచివున్నారు.