ఆంధ్రప్రదేశ్‌

శ్రీవారి ఆలయంలో 14నుంచి జ్యేష్ట్భాషేకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 11: తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం శ్రీదేవి, భూదేవీ సమేత శ్రీ మలయప్ప స్వామివారికి కవచ తొలగింపు కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. రెండో ఘంట అనంతరం రంగనాయకుల మండపంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈనెల 14న జ్యేష్ఠ్భాషేకం నిర్వహించనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. సంవత్సరం పొడవునా నిర్వహించే అభిషేకాది క్రతువులు కారణంగా ఉత్సవ మూర్తుల విగ్రహాలు అరిగిపోకుండా పరిరక్షించుకునేందుకు కవచాలను తొలగించి శుద్ధి చేసే కార్యక్రమాన్ని టీటీడీ ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది. సాధారణంగా జ్యేష్ఠ్భాషేకానికి ముందు మంగళవారం కవచాలను తొలగించి అవసరమైన మరమ్మతులు పూర్తి చేస్తారు. ఈనెల 14 నుండి మూడు రోజులపాటు జరిగే జ్యేష్ఠ్భాషేక కార్యక్రమంలో తొలి రోజు స్వామి అమ్మవార్ల ఉత్సవర్లకు వజ్ర కవచం, రెండో రోజు ముత్యాల కవచం, మూడో రోజు బంగారు కవచాన్ని సమర్పించి ఊరేగిస్తారు. కాగా కవచాల తొలగింపు కార్యక్రమంలో టీటీడీ ఈఓ ఏకె సింఘాల్, జేఈఓ శ్రీనివాసరాజు, శ్రీవారి ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, పేష్కార్ లోకనాథం తదితరులు పాల్గొన్నారు.