ఆంధ్రప్రదేశ్‌

అనుబంధ కళాశాలలకు శాశ్వత అఫిలియేషన్ తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 11: ఆంధ్ర విశ్వవిద్యాలయం అనుంబంధ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాలు శాశ్వత అఫిలియేషన్, అటానమస్ హోదాలు సాధించే దిశగా దరఖాస్తు చేసుకోవాలని వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ జీ నాగేశ్వరరావు స్పష్టం చేశారు. విశాఖ ఏయూ కనె్వన్షన్ సెంటర్‌లో ఏయూ అనుబంధ కళాశాలల యాజమాన్యాలు, కరస్పాండెంట్లతో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిగ్రీ కళాశాలలు కూడా రాటిఫికేషన్ ప్రక్రియకు హాజరు కావాలని స్పష్టం చేశారు. నాక్ గుర్తింపునకు దరఖాస్తు చేసుకోవాలని, తద్వారా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే నిధులు కేటాయించే అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్ర విశ్వవిద్యాలయాలతో సమానంగా అనుబంధ కళాశాలలను అభివృద్ధి చేస్తూ అవసరమైన నిధులు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని గుర్తు చేశారు. వర్శిటీ విద్యార్థులకు సంబంధించి సమగ్ర డేటాను పొందే విధంగా నూతన విధానం (స్టూడెంట్ ఎన్‌రోల్‌మెంట్) అమలు చేస్తున్నామని, దీనిని ప్రతి కళాశాల వినియోగించుకోవాలని సూచించారు. డిగ్రీ, పీజీ పరీక్షల్లో ఓఎంఆర్ విధానాన్ని అమలు చేస్తామన్నారు. తద్వారా పరీక్షలు ముగిసిన తరువాత 15 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేసేందుకు అస్కారం ఉంటుందన్నారు. ప్రయోగాత్మకంగా ఈ విధానం ఏయూలో అమలు చేశామని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని అనుబంధ కళాశాలలకు దీన్ని వర్తింప చేస్తామన్నారు. రూసా నిధులు రూ.35 కోట్లతో వర్శిటీలో నూతన ఫార్మశీ టెస్టింగ్ ల్యాబ్, మరో రూ.15 కోట్లతో ఎంప్లాయిబిలిటీ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. దీని సహాయంతో వర్శిటీ విద్యార్థుల్లో ఉపాధికి అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. వర్శిటీ రెక్టార్ ప్రొఫెసర్ ఎం ప్రసాదరావు మాట్లాడుతూ నాణ్యమైన విద్యను అందించే దిశగా కళాశాలలు పనిచేయాలని కోరారు. నిబద్ధత కలిగిన ఉపాధ్యాయులు, వౌలిక వసతులు కలిగిన ప్రాంగణాలు, విద్యార్థులకు నైపుణ్యాలు, విలువలతో కూడిన విద్యను అందించాలని సూచించారు. సమావేశంలో భాగంగా సీడీసీ డీన్ ప్రొఫెసర్ హరిప్రకాష్ మాట్లాడుతూ పీజీ, యూజీ కళాశాలల్లో వార్షిక పరిశీలన జరుగుతోందని, జ్ఞానభూమిలో ఇప్పటి వరకూ 308 కళాశాలల్లో 302 కళాశాలల వివరాలు అందించామన్నారు.
చిత్రం...అనుబంధ కళాశాలల సమావేశంలో మాట్లాడుతున్న ఏయూ వీసీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు