ఆంధ్రప్రదేశ్‌

29నుంచి జల ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 11: ఉత్తరాంధ్ర నీటి సంక్షోభాన్ని పరిష్కరించేందుకు జల వనరుల పరిరక్షణ ఉద్యమాన్ని నిర్వహిస్తామని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇఏఎస్ శర్మ తెలిపారు. విశాఖలో మంగళవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 29న ఈ ఉద్యమం ఆరంభమవుతుందన్నారు. జల మానవుడు (వాటర్ మ్యాన్)గా గుర్తింపు పొందిన డాక్టర్ రాజేంద్ర సింగ్ రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రజలకు అవగాహన కల్పించి ప్రభుత్వ ఖజానాకు ఆర్థిక భారం పడకుండా 12 నదులను పునర్జీవం చేశారన్నారు. ఇదే తరహాలో ఉత్తరాంధ్ర ప్రాంతంలోని నదులు, చెరువులు, జలాశయాలను పునర్జీవం చేసేందుకు ఇక్కడకు ఆయన వస్తున్నారన్నారు. ఉత్తరాంధ్ర నీటి సంక్షోభాన్ని పరిష్కరించేందుకు వీలుగా డాక్టర్ రాజేంద్రసింగ్‌ను అభ్యర్ధించామన్నారు. ఉత్తరాంధ్రలో మూడు రోజుల పాటు ఈ నెల 29 నుంచి వచ్చేనెల 1 వరకు పర్యటించేందుకు ఆయన అంగీకరించారన్నారు. నదుల పునర్జీవానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని పంచుకునేందుకు, మన భూగర్భ జలాల మట్టాలను మెరుగుపరిచేందుకు, జలాశయాలు, చెరువులు, నదులను పునర్జీవింపచేసేందుకు ఆయన అవగాహన కల్పించనున్నారన్నారు. ఉత్తర బృందావన్ గార్డెన్స్‌గా పిలిచే ముడసర్లోవ పార్క్‌కు మంచి ప్రాచుర్యం ఉందన్నారు. ఈ జలాశయాన్ని బ్రిటీష్‌వారు 1901లో నిర్మించారని, ఇది విశాఖ నగరానికి రోజుకు ఒక మిలియన్ గ్యాలన్ల తాగునీటి అవసరాలను తీర్చిందన్నారు. అయితే 1981వ సంవత్సరం వరకే ఇది సాధ్యపడిందని, అనంతరం దీనికి దిగువన నగర ప్రజలు ఆహ్లాదంగా గడిపేందుకు ఒక పార్క్‌ను రూపొందించారన్నారు. నగర నీటి అవసరాలు ఒక ఎంజీడీ నుంచి 40 ఎంజీడీలకు పెరిగాయన్నారు. ఏలేరు, తాటిపూడి, రైవాడ, మేఘాద్రిగెడ్డ జలాశయాల నుంచి నీటిని సరఫరా చేస్తున్న నేపథ్యంలో ఈ జలాశయం నిరాదరణకు గురైందని ఆందోళన వ్యక్తంచేశారు. నిరాదరణ కారణంగానే వీటిలోని కొన్ని జలాశయాలు వాటి సామర్థ్యం తగ్గిపోయిందన్నారు.
పర్యావరణ నిపుణులు, జల సంఘం ప్రతినిధి బోలిశెట్టి సత్యనారాయణ (సత్య) మాట్లాడుతూ నీటి సంక్షోభంపై జీవీఎంసీ కమిషనర్‌కు వివరించగా ఆయన స్పందించారన్నారు. విశాఖ భీమిలి నియోజకవర్గం పరిధిలో పులిపాటి, పెద్దిపాలెం ఏర్ల 80శాతం మేర ఆక్రమణలకు గురయ్యాయన్నారు. పాడేరులో కళ్యాణలోవ వద్ద అక్రమ నిర్మాణాలు జరిగాయన్నారు. ఇక్కడి గనులు తవ్వకాలను లీజులకు ఇవ్వడంతో వ్యవసాయం చేసే గిరిజనులు ఐదు వేల ఎకరాల్లో సాగు చేసుకునే 20వేల మంది నష్టపోవాల్సి వచ్చిందన్నారు. నీటి వనరుల పరిరక్షణలో భాగంగా ఈ నెల 29న విశాఖలోను, 30న కళ్యాణలోవ, వచ్చే నెల ఒన భీమిలి, శ్రీకాకుళం ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. రాజస్థాన్‌లో 200 మిల్లీమీటర్ల వర్షపాతం ఉన్నా తాగునీరు, వ్యవసాయానికి ప్రాధాన్యతనిస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు.
చిత్రం...విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ