ఆంధ్రప్రదేశ్‌

వ్యవసాయానికి 9 గంటల పగటిపూట ఉచిత విద్యుత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 13: వ్యవసాయానికి పగటిపూటే 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ త్వరలోనే ఇస్తామని రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణశాఖల మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వబోతున్నామన్నారు. సచివాలయం రెండో బ్లాక్‌లో ఉన్న తన కార్యాలయంలో గురువారం కార్యాలయ ప్రవేశం చేసి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ రైతులకు సీఎం జగన్మోహన్‌రెడ్డి హామీ ఇచ్చిన విధంగా త్వరలోనే వ్యవసాయానికి పగటిపూట 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించనున్నట్లు ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని మంత్రి వెల్లడించారు. ఇకపై ఆక్వా రంగానికి రూ. 1.50 పైసలకు యూనిట్ ఇవ్వనున్నామని తెలిపారు. దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏలు)పై పునః పరిశీలన చేస్తామని, ఈ విషయమై సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అనుమతి ఇచ్చారన్నారు. ఎర్ర చందనం అక్రమ రవాణాను అడ్డుకుని తీరతామన్నారు. ఇందుకోసం ఐజీ స్థాయిలో అధికారిని నియమించి ఎర్ర చందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తామన్నారు. ప్రస్తుతం 5వేల టన్నుల ఎర్రచందనం అటవీశాఖ వద్ద ఉందని, ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే వేలం వేస్తామని తెలిపారు. మంత్రిగా తన తొలి సంతకం వన్యమృగ సంరక్షణకు చెందిన ఫైల్‌పై చేసినట్లు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ముందుగా వేద పండితుల మంత్రోచ్ఛారణాలు, ఆశీర్వచనాల నడుమ మంత్రి కార్యాలయ ప్రవేశం చేశారు. ఈ సందర్భంగా ఇంధన, అటవీ, పర్యావరణ శాఖాధికారులు, కార్యకర్తలు, నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

చిత్రం... బాధ్యతలు స్వీకరిస్తున్న మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి