ఆంధ్రప్రదేశ్‌

ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), జూన్ 13: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను గురువారం విద్యాశాఖ మంత్రి ఆదిమూలం సురేష్ నగరంలోని ఒక హోటల్‌లో విడుదల చేశారు. ప్రధమ సంవత్సరం జనరల్‌లో 3,33,571 మంది హాజరుకాగా 68 శాతంతో 2,25,781 మంది ఉత్తీర్ణత సాధించారు.
ప్రథమ సంవత్సరం ఒకేషనల్ విభాగంలో 12,454 మంది హాజరుకాగా 7,021 మంది ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం జనరల్ విభాగంలో 1,30,614 మంది హాజరుకాగా 66,114 మంది ఉత్తీర్ణత సాధించగా 51శాతం ఉత్తీర్ణత నమోదయింది. ఒకేషనల్ విభాగంలో 6,166 మంది హాజరుకాగా 3,308 మంది 54శాతం ఉత్తీర్ణత సాధించారు. అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలకు సంబంధించి రీకౌంటింగ్, స్కాన్ కాపీ, రీ వెరిఫికేషన్‌కు జవాబు పత్రాలను నిర్ణీత రుసుం వసూలు చేసి అందిస్తారన్నారు. ఇందు కోసం వెబ్‌సైట్‌లో శుక్రవారం నుండి ధరఖాస్తులను అందుబాటులో ఉంచుతామని, ఆసక్తి కల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకోవడానికి 22వ తేదీ ఆఖరు అని పేర్కొన్నారు. ఈ తేదీని పొడిగించే అవకాశం లేదని, రీ కౌంటింగ్‌కు రూ.260 ప్రతి పేపర్‌కు చెల్లించాలన్నారు. స్కాన్ కాపీ, రీ వెరిఫికేషన్‌కు సంబంధించి ప్రతి పేపర్‌కు రూ.1300 చెల్లించాలని మంత్రి పేర్కొన్నారు. ఇలాఉంటే పాఠ్యాంశాల్లో మరింత సరళీకృత విధానాలను అమలు చేయడంలో భాగంగా ఇంటర్ తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం, ఉర్దూ పాఠ్యపుస్తకాలను విడుదల చేశారు. విద్యార్థులకు నూతన సిలబస్‌ను అందుబాటులోనికి తీసుకువస్తామన్నారు.