ఆంధ్రప్రదేశ్‌

పంచ గ్రామాల సమస్య త్వరలో పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 13: త్వరలోనే విశాఖపట్నం పంచ గ్రామాల సమస్య పరిష్కరించనున్నట్లు మంత్రులు ముత్తంశెట్టి(అవంతి) శ్రీనివాసరావు, వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రారంభించినట్లు తెలిపారు. సచివాలయంలోని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో మంత్రులు మాట్లాడారు. ముందుగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ పంచగ్రామాల సమస్య పరిష్కారానికి గత ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఎన్నికల సమయంలో సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పంచగ్రామాల సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారన్నారు. ప్రస్తుతం కోర్టులో ఉన్న కేసును వెకేట్ చేయించి, పంచ గ్రామాల సమస్య పరిష్కరించాలని కేబినెట్‌లో నిర్ణయించామన్నారు. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా పంచ గ్రామాల సమస్య ఉందని తెలిపారు. విశాఖపట్నంలోని 5 నియోజకవర్గాల్లో 12వేల కుటుంబాలతో పాటు ఎందరో రైతులు పంచ గ్రామాల సమస్య కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కొద్ది రోజుల్లో పంచ గ్రామాలకు న్యాయం చేస్తామని మంత్రి వెలంపల్లి వెల్లడించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌సింగ్, సింహాచలం ఆలయ ఈవో తదితరులు పాల్గొన్నారు.

చిత్రం... విలేఖరులతో మాట్లాడుతున్న మంత్రులు అవంతి శ్రీనివాస్, వెలంపల్లి శ్రీనివాసరావు