ఆంధ్రప్రదేశ్‌

బలహీన వర్గాలకు సీఎం ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), జూన్ 13: బీసీ గర్జన సభలో హామీ ఇచ్చిన విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బలహీనవర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. అందులో భాగంగా తమ్మినేని సీతారామ్‌కు శాసనసభ స్పీకర్‌గా అవకాశం ఇచ్చారన్నారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో బొత్స మాట్లాడుతూ మంత్రివర్గ కూర్పులోనే కాకుండా స్పీకర్ ఎంపికలో కూడా సామాజిక న్యాయం పాటిస్తూ బలహీన వర్గాల వారికి ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు. శాసనసభ స్పీకర్ ఎంపికలో తీసుకున్న చొరవ, నిర్ణయానికి బలహీన వర్గాల తరపున సీఎంకు కృతజ్ణతలు తెలిపారు. స్పీకర్‌కు ధన్యవాదాల తీర్మానం సందర్భంగా సభలో అందరూ హుందాగా ప్రవర్తించారన్నారు. ఫిరాయింపులకు అవకాశం లేకుండా శాసనసభ రాజ్యాంగ బద్ధంగా, చట్టబద్ధంగా, సంప్రదాయబద్ధంగా జరగాలని ముఖ్యమంత్రి కోరుకోవడం చూస్తుంటే ప్రజాస్వామ్య విలువలకు ఆయన ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో తెలుస్తోందన్నారు. శాసనసభ అదికార పార్టీ నాయకుల కనుసన్నల్లో కాకుండా ప్రజాస్వామ్యానికి విలువనిస్తూ, రాజ్యాంగంపై విశ్వసనీయత నిలిపే విధంగా నడుస్తుందన్న నమ్మకం ఏర్పడిందన్నారు. అందరూ దీనిని హర్షిస్తున్నారని మంత్రి బొత్స పేర్కొన్నారు.
చిత్రం... అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న మంత్రి బొత్స సత్యనారాయణ