రాష్ట్రీయం

రూ. 6,400 కోట్లతో లింక్ రోడ్ల నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 13: నేషనల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎన్‌డీబీ) సాయంతో రాష్ట్రంలో రూ. 6,400 కోట్లతో 3వేల కిలోమీటర్ల లింక్ రోడ్లతోపాటు 759 వంతెనల నిర్మాణానికి నిర్ణయించినట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ వెల్లడించారు. సచివాలయం ఐదో బ్లాక్‌లోని తన కార్యాలయంలో గురువారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నీతివంతమైన పాలన అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కంకణం కట్టుకున్నారన్నారు. బీసీ డిక్లరేషన్ సందర్భంగా ఇచ్చిన హామీల్లో భాగంగా కేబినెట్‌లో 50 శాతానికి పైగా వెనుకబడిన తరగతుల ఎమ్మెల్యేలకు అవకాశమిచ్చారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన గుర్తు చేసేలా జగన్ పాలన ఉండబోతోందన్నారు. ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమిస్తూ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రీ తీసుకోలేని చారిత్రాత్మక నిర్ణయాన్ని జగన్ తీసుకున్నారన్నారు. రూ. 20 కోట్లతో 385.31 కిలోమీటర్ల మేర అనంతపురం - అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చట్టిందన్నారు. ఇప్పటికే 19 ప్యాకేజీల్లో 14 ప్యాకేజీ పనులు పూర్తయ్యాయన్నారు. మిగిలిన 5 ప్యాకేజీ పనులు త్వరగా పూర్తి చేసి రెండేళ్లలో అనంతపురం - అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవేను వినియోగంలోకి తీసుకొస్తామని మంత్రి ప్రకటించారు. నేషనల్ డెవలప్‌మెంట్ బ్యాంక్, రాష్ట్ర ప్రభుత్వం 70:30 నిష్పత్తిలో రూ. 6,400 కోట్లతో లింక్ రోడ్ల నిర్మాణానికి సంబంధించిన ఫైల్‌పై మంత్రిగా తన తొలి సంతకం చేసినట్లు ఆయన తెలిపారు. 2,250 కిలోమీటర్ల నాన్ బీటీ రోడ్లను బీటీ రోడ్లుగా అభివృద్ధి చేయనున్నామని ఇప్పటికీ 980 కిలోమీటర్ల రోడ్లకు అనుమతులిచ్చామని తెలిపారు. మిగిలిన 1,270 కిలోమీటర్ల పనులు త్వరలో చేపట్టనున్నామని మంత్రి కృష్ణదాస్ వెల్లడించారు. దుర్గగుడి ఫ్లైఓవర్ పనులు ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామన్నారు. అంతకు ముందు వేద పండితుల మంత్రోచ్ఛారణాలు, ఆశీర్వాచనాల నడుమ మంత్రి తన కార్యాలయ ప్రవేశం చేశారు. ఈ సందర్భంగా రోడ్లు, భవనాల శాఖ ఉన్నతాధికారులు, కార్యకర్తలు, నాయకులు మంత్రికి అభినందనలు తెలిపారు.
చిత్రం... బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడుతున్న మంత్రి ధర్మాన కృష్ణదాస్