ఆంధ్రప్రదేశ్‌

నుడా చైర్మన్, డైరెక్టర్ల రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు టౌన్, జూన్ 13 : నెల్లూరు రూరల్, అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటి( నుడా) చైర్మన్ పదవికి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, ముగ్గురు డైరెక్టర్లు ఖాజావలి, రంగారావు, రఘునాథరెడ్డి తమ రాజీనామాలను గురువారం ఆ కార్యాలయంలోని చైర్మన్ ఛాంబర్‌లో వైస్ చైర్మన్ అరుణ్‌బాబుకు అందించారు. పదవీకాలం ఇంకా ఉన్నా ప్రభుత్వం మారడంతో ఆయనతోపాటు డైరెక్టర్లు కూడా ఈ నిర్ణయం తీసుకుని రాజీనామాలు చేశారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా ఏర్పడిన నాలుగు అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటిల్లోకెల్లా ఈ నుడాలోనే రూ.50 కోట్లతో చంద్రబాబునాయుడు సహకారంతో పొంగూరు నారాయణ చొరవతో జిల్లా వ్యాప్తంగా ఎంతో అభివృద్ధి చేశామని తెలిపారు. నెల్లూరు నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామని చెప్పారు. ఇంతకాలం తనకు సహకరించిన నుడా సిబ్బందికి కోటంరెడ్డికి శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలతో సత్కరించారు.