రాష్ట్రీయం

పారదర్శకంగా కొత్త ఇసుక విధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూన్ 13: సామాన్యుడికి సైతం సవ్యంగా అందేలా, ఆదాయమంతా ప్రభుత్వ ఖజానాకు చేరేలా రాష్ట్రంలో కొత్త ఇసుక విధానం ఉండాలని పలువురు సూచిస్తున్నారు. రాష్ట్రంలో ఇసుక అక్రమాలను అడ్డుకుని, కొత్త విధానాన్ని ప్రవేశపెట్టడానికి వీలుగా తవ్వకాలు, రవాణాను ప్రభుత్వం నిషేధించిన సంగతి విదితమే. జూలై ఒకటో తేదీ నుంచి కొత్త ఇసుక విధానం అమల్లోకి తీసుకురావడానికి కసరత్తు జరుపుతున్న నేపథ్యంలో ప్రభుత్వానికి పలు సూచనలు అందుతున్నాయి. కాగా రాష్ట్రంలో ఇసుక విధానం ఎలా ఉండాలనే విషయమై కానె్ఫడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడయ్) సంస్థకు రాజమహేంద్రవరం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న పలువురు పలు సూచనలు చేశారు. ఎటువంటి అక్రమాలకు, అవినీతికి తావులేని విధంగా ఒక ప్రత్యేక యాప్‌ను రూపొందించడం ద్వారా ఆన్‌లైన్‌లో ఇసుక విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని క్రెడయ్ సూచిస్తోంది. గోదావరి నది ఇసుక నిర్మాణ రంగానికి శ్రేష్ఠమైనది కావడంతో డిమాండ్ అధికంగావుంది. అయితే ప్రభుత్వాలు మారిన తర్వాత పాలసీల్లో మార్పులు వచ్చిన సందర్భాన్ని ఆసరా చేసుకుని కొత్త మాఫియా పుట్టుకొచ్చి అక్రమార్జన అవకాశం లేకుండా సత్వరం తగిన చర్యలు తీసుకోవాల్సివుందని క్రెడయ్ పేర్కొంది. గోదావరి జిల్లాల నుండి విశాఖ, విజయవాడ తదితర నగరాలతో పాటు తెలంగాణలోని హైదరాబాద్, తమిళనాడులోని చెన్నై, ఒడిస్సా రాష్ట్రాలకు యధేచ్ఛగా ఇసుక రవాణా జరుతుతోంది. ముందుగా చెక్‌పోస్టులు పెట్టి రాష్ట్రేతర ప్రాంతాలకు జరిగే ఇసుక రవాణాకు చెక్ పెట్టాలి. అలాగే రాష్ట్రంలోనే ఇసుక వినియోగించుకునేలా చర్యలు చేపడితే కొరత లేకుండా, ధర అదుపులో ఉంటుందని నిర్మాణ రంగ నిపుణులు చెబుతున్నారు. వేసవి సీజనులో నిర్మాణాలు జోరుగా సాగుతాయి. ఇటువంటి తరుణంలో ఇసుకకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాల్సివుంది. నిషేధం పేరుతో కృత్రిమ కొరతకు తావులేకుండా చూడాల్సివుంది. మన ఇసుక మనమే వాడుకోవాలనే నినాదంతో ఏపీ దాటకుండా చూస్తే ఇసుకకు రాష్ట్రంలో కొరత వుండదని పేర్కొంటున్నారు. ఇందుకుగాను ర్యాంపుల్లో నిఘా పెట్టాల్సివుంది. ప్రత్యేకంగా ఒక యాప్ రూపొందించి, ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే విధానాన్ని ప్రవేశపెడితే, ఆదాయమంతా ప్రభుత్వ ఖజానాకే చేరుతుంది. సాధ్యమైనంత మేరకు కొత్త ర్యాంపులను తయారుచేసి, అక్కడ బాటలు ప్రభుత్వమే ఏర్పాటుచేయాలి. స్టాకు పాయింట్లు ప్రభుత్వమే గుర్తించి అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి, ఎలక్ట్రానిక్ టోల్‌గేట్ పెట్టి, ర్యాంపుల్లో రవాణా పారదర్శకంగా నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని క్రెడయ్ సూచిస్తోంది. సీసీ కెమెరాలను సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానించాల్సివుంది. ఇసుక రవాణా చేసే ట్రాన్స్‌పోర్టు వాహనాలకు జీపీఎస్ అమర్చి, ఆయా వాహనాలు ఏ యజమానికి, ఎక్కడ అన్‌లోడ్ చేయాలనే విషయాన్ని కూడా పరిశీలించే విధంగా చర్యలు తీసుకోవాలి. జీపీఎస్ వ్యవస్థ అమలుచేస్తే అమరావతి నుంచి కూడా పరిశీలించుకునే వీలుంటుంది. ఇన్‌వాయిస్‌లను కూడా తనిఖీ చేసే వ్యవస్థ వుండాలని, దీనికి తోడు ఎక్కడైనా అనధికారిక రవాణా జరుగుతున్నట్టయితే పట్టుకుని, కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకుంటే ఇసుక అక్రమాలు తగ్గి, సామాన్యులకు అందుతుందన్నారు. సామాన్యుడికి భారం కాకుండా, రాష్ట్ర ఆదాయానికి డోకా లేకుండా, ఇసుక ధరలు ఏ విధంగా నిర్ణయించినప్పటికీ ఆ మొత్తం నేరుగా ప్రభుత్వానికే వెళ్ళాలని,ప్రైవేటు వ్యక్తులకు చేరకుండా తగిన విధంగా కొత్త పాలసీ రూపొందించాలని క్రెడయ్ పెద్దలు సూచిస్తున్నారు.