ఆంధ్రప్రదేశ్‌

లా పరీక్షలో కాపీ కొడుతూ పట్టుబడ్డ మాజీ ఎమ్మెల్యే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 24: పిసిసి ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే షేక్ మస్తాన్‌వలి లా పరీక్షల్లో కాపీ కొడుతూ పట్టుబడ్డారు. గురువారం గుంటూరు నగరంలోని ఎసి న్యాయ కళాశాలలో జరిగిన లా మొదటి సంవత్సరం చివరి పరీక్ష సందర్భంగా ఈ సంఘటన జరిగింది. మస్తాన్‌వలితోపాటు, బిజెపి నాయకుడు భాస్కరరావు, యూత్ కాంగ్రెస్ నాయకుడు ఎస్‌కె జిలానిలు మిగిలిన అభ్యర్థులతో కలిసి ఒకే గదిలో పరీక్షలు రాస్తున్నారు. ఈ సమయంలో ప్రత్యేక స్క్వాడ్ తనిఖీ నిర్వహించింది. మస్తాన్‌వలి సమీపంలో స్లిప్‌లు ఉండటం, స్లిప్‌లలో ఉన్న సబ్జెక్టుకు మస్తాన్‌వలి జవాబుపత్రంలో ఉన్న సబ్జెక్టు ఒకేలా ఉండటంతో వారి ప్రశ్న పత్రాలు, జవాబుపత్రాలు, స్లిప్‌లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. అయితే ఈ విషయమై మస్తాన్‌వలి స్పందిస్తూ స్క్వాడ్‌కు దొరికిన స్లిప్‌లు తనవి కావని, రెండు బెంచీలకు అవతల ఉన్న స్లిప్‌లను తీసుకువచ్చి తనవిగా చూపించే ప్రయత్నం చేశారని అన్నారు. ఈ విషయమై తాను లిఖితపూర్వకంగా స్క్వాడ్ అధికారులకు రాసి ఇవ్వడం జరిగిందని, వారితో వాదన పెట్టుకోవడం వలన మిగిలిన అభ్యర్థుల పరీక్ష సమయానికి అంతరాయం కలిగే అవకాశముందన్న ఉద్దేశంతో తాను స్వచ్ఛందంగా పరీక్ష హాల్ నుంచి బయటకు వచ్చేశానని తెలిపారు. ఈ విషయమై కళాశాల ప్రిన్సిపాల్ ముత్యంను వివరణ కోరగా... తాను ఆ సమయంలో యూనివర్సిటీ పనిమీద బయటకు వెళ్లానని, తిరిగి వచ్చిన తరువాత సంఘటన విషయం స్క్వాడ్ అధికారులు తన దృష్టికి తీసుకొచ్చిన మాట వాస్తవమేనని తెలిపారు.

chitram షేక్ మస్తాన్‌వలి