ఆంధ్రప్రదేశ్‌

ఏఎన్‌ఎం నిర్లక్ష్యం.. చిన్నారులకు శాపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీరాల, జూన్ 15: ఏఎన్‌ఎం తీవ్ర నిర్లక్ష్యం కారణంగా నలుగురు చిన్నారుల ప్రాణం మీదకు ముప్పు వచ్చి పడింది. జ్వరానికి వాడాల్సిన ట్యాబ్లెట్లు కాకుండా షుగర్ వ్యాధికి సంబంధించిన మందులు వేయడంతో ఆ చిన్నారులు తీవ్ర అస్వస్ధతకు గురయ్యారు. అపస్మారక స్ధితిలోకి వెళ్ళి ప్రాణాపాయం కావడంతో చీరాల్లోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించి చికిత్సలు చేశారు. ప్రస్తుతం ఆ చిన్నారుల పరిస్థితి ఆందోళన నుంచి బైటపడ్డారు. కొద్ది సమయం మించినట్లయితే నలుగురు చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసేవి. ఈ సంఘటన శనివారం ప్రకాశం జిల్లా చీరాల మండలంలోని విజయనగర్ కాలనీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే విజయనగర్ కాలనీకి చెందిన 45 రోజుల చిన్నారులు డి బాబు, తేళ్ళ బాబు, తేళ్ళ పాప, రేణుమళ్ళ పాపలకు శనివారం గ్రామంలోని ఆరోగ్య ఉపకేంద్రంలో ఐటివీ వ్యాక్సిన్‌లు (పోలియో రాకుండా రోటా వైరస్, పెంటాలెవల్) ఇంజక్షన్‌లను ఏ ఎన్ ఎం భాగ్యలక్ష్మీ వేశారు. ఈ వ్యాక్సిన్‌లు వేసినప్పుడు చిన్నారులకు జ్వరం వస్తుంది. జ్వరం తగ్గడానికి ప్రతి చిన్నారికి పారాసెట్‌మాల్ మందు బిళ్లలకు బదులు మెట్ఫార్విన్ (షుగర్ బిళ్లలు) చిన్నారుల తల్లిదండ్రులకు ఏ ఎన్ ఎం అందించింది. వ్యాక్సిన్‌లు తీసుకున్న చిన్నారులకు జ్వరం రావడంతో తగ్గడానికి ఏ ఎన్ ఎం ఇచ్చిన మందు బిళ్ళను వేయగా అది షుగర్ బిళ్ళ కావడంతో వికటించింది. దీంతో నలుగురు చిన్నారులు తీవ్ర అస్వస్ధతకు గురయ్యారు. 45 రోజుల చిన్నారులు అస్వస్ధతకు గురవడంతో చిన్నారుల తల్లిదండ్రులు ఏ ఎన్ ఎంను విచారించగా జ్వరం బిళ్ళలకు బదులు షుగర్ మాత్రలు అందించానని చెప్పడంతో వెంటనే నలుగురు శిశువులను తల్లిదండ్రులు పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించి చికిత్సలు చేయించారు. నలుగురు శిశువులకు హుటాహుటిన ప్రథమ చికిత్సలతో పాటుగా పొట్టలోకి పైపు పంపించి మందు బిళ్ళలను బైటకు రప్పించడంతో ప్రాణాపాయం తప్పింది. దీంతో అటు చిన్నారుల తల్లిదండ్రులు ఉపశమనం పొందారు. రెండు గంటలు ఆలస్యమైతే తమ పిల్లలు తమకు దక్కేవారు కాదని వారు చెప్పడంతో అందరినీ కలచివేసింది. ఏ ఎన్ ఎం అజాగ్రత్తగా వ్యవహరించి చిన్నపిల్లల వైద్యసేవల పట్ల నిర్లక్ష్యధోరణితో వ్యవహరించడంతో ఏ ఎన్ ఎం భాగ్యలక్ష్మీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పిహెచ్‌సీ వైద్యులు శ్రీదేవి అపస్మారక స్ధితిలోకి వెళ్ళిన నలుగురు శిశువులను పరిశీలించి ప్రాణాపాయం లేకుండా వైద్య సేవలు అందించేలా దగ్గరుండి పర్యవేక్షించారు. శిశువుల ఆరోగ్య పరిస్ధితి నిలకడగానే ఉందని వైద్యులు శ్రీదేవి తెలిపారు. ఏ ఎన్ ఎం భాగ్యలక్ష్మీపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే ఛార్జి మెమో ఇచ్చామని, సంఘటనను డీఎంహెచ్‌వోకు వివరించినట్లు డాక్టర్ శ్రీదేవి వెల్లడించారు.