ఆంధ్రప్రదేశ్‌

అనంతలో వేరుశెనగ విత్తనాల పంపిణీ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, జూన్ 15: అనంతపురం జిల్లాలో రైతులకు సబ్సిడీ విత్తన వేరుశెనగ పంపిణీ శనివారం ప్రారంభమైంది. జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రత్యేక కౌంటర్ల ద్వారా రైతులకు సబ్సిడీపై విత్తనాలు అందజేశారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్‌యార్డులో బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకరనారాయణ విత్తన పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. నాణ్యతలో ఏమాత్రం తేడా ఉన్నా రైతులు వాపసు చేయాలన్నారు. రూ.2,840 రూపాయల సబ్సిడీపై రైతులకు వేరుశెనగ విత్తనకాయలు అందజేస్తున్నారు. కె-6 వేరుశెనగ విత్తనం క్వింటాలు ధర రూ.7,100 కాగా 40 శాతం రాయితీ 2,840 పోను మిగతా సొమ్ము రూ.4,260 రైతులు చెల్లించి క్వింటాలు విత్తనం పొందవచ్చు. జిల్లా వ్యాప్తంగా 98,470 క్వింటాళ్ల విత్తనాలను రైతుల కోసం అందుబాటులో ఉంచారు.