ఆంధ్రప్రదేశ్‌

ఖరీఫ్‌కు సర్వం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూన్ 15: ప్రస్తుత ఖరీఫ్ సీజనులో రైతులకు పంపిణీచేయడానికి విత్తనాలు, ఎరువులు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. వరి, వేరుశనగ తదితర విత్తనాలు సరిపడేంతగా సిద్ధం చేశామన్నారు. అయితే నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులపై ఉక్కుపాదం మోపుతామన్నారు. మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం శనివారం తొలిసారిగా తూర్పు గోదావరి జిల్లాకు విచ్చేసిన ఆయన రాజమహేంద్రవరంలోని బొమ్మూరులో విలేఖర్లతో మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని తమది రైతు పక్షపాతి ప్రభుత్వమని, వారికి ఎవరైనా అన్యాయం తలపెడితే సహించేది లేదన్నారు. అవసరమైన మేరకు ఉచితంగా బోర్లు వేసి, సాగునీటి అవసరాలు తీర్చడానికి రైతులకు అందుబాటులో ఉండేవిధంగా నియోజకవర్గానికో మొబైల్ బోర్ రిగ్ ఏర్పాటుచేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు, పార్లమెంట్ నియోజవర్గానికి ఒకటి చొప్పున కూడా మొబైల్ రిగ్‌లు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. రైతు భరోసా పథకాన్ని రెండో ఏడాది నుంచి ప్రారంభించాలనుకున్నప్పటికీ ముఖ్యమంత్రి ఈ ఏడాది నుంచే ప్రారంభించడానికి చర్యలు తీసుకున్నారన్నారు. రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కౌలు రైతులకు కూడా రుణాలందించే విధంగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారన్నారు. సహకార సంఘాలపై వస్తున్న ఆరోపణలు, ఫిర్యాదులను పరిశీలించి తగిన విధంగా చర్యలు తీసుకుంటామని కన్నబాబు పేర్కొన్నారు. రాష్ట్రానికి గతంలో కేంద్రం అందించిన కరవు నిధులను సైతం గత టీడీపీ ప్రభుత్వం దారిమళ్ళించేసిందన్నారు. కేంద్రం రూ.932 కోట్ల నిధులు మంజూరు చేస్తే వాటిలో ఒక్క కోటి రూపాయలు కూడా కరవు నివారణకు వినియోగించలేదన్నారు. గత మూడు నెలలుగా ధాన్యం కొనుగోలు నిమిత్తం రైతులకు చెల్లింపులు చేయలేని పరిస్థితి దాపురించిందని మంత్రి కన్నబాబు దుయ్యబట్టారు.