ఆంధ్రప్రదేశ్‌

ఐదేళ్లలో గిరిజన సమస్యలన్నీ పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూన్ 15: రాష్ట్రంలో వచ్చే ఐదేళ్లలో గిరిజన సమస్యలన్నీ పరిష్కరిస్తానని ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి పి.పుష్పశ్రీవాణి స్పష్టం చేశారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా ఆమె జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా స్థానిక జెడ్పీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం గిరిజన సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల పారితోషికాన్ని రూ.400 నుంచి రూ.4 వేలకు పెంపుదల చేస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి సూచించగా ఆయన సుముఖత వ్యక్తం చేశారన్నారు. రాష్ట్రంలో అవినీతి రహిత పాలనను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభుత్వంలో ఏ రకమైన అవినీతి జరిగినా ఉపేక్షించేది లేదన్నారు. టెండర్లలో అవినీతిని నిరోధించేందుకు జ్యూడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇదిలా ఉండగా అవినీతిపై ఫిర్యాదులకు టోల్‌ఫ్రీ నంబరు ఏర్పాటు చేసినట్టు ఆమె తెలిపారు. రాష్ట్రంలో నవరత్నాలను శతశాతం అమలు చేస్తామన్నారు. అలాగే అక్టోబర్ 15 నుంచి రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామన్నారు. అర్హులైన రైతులకు రూ.12500 ఆర్థిక సాయం అందించడంతోపాటు ప్రతి రైతుకు ఉచితంగా బోరు మంజూరు చేస్తామన్నారు. రాష్ట్రంలో వచ్చే ఐదేళ్లలో 25 లక్షల ఇళ్లను నిరుపేద కుటుంబాలకు నిర్మించనున్నట్టు తెలిపారు. ఏడాదికి నాలుగు లక్షల ఇళ్లు చొప్పున నిర్మిస్తామన్నారు. వచ్చే ఉగాది నుంచి పక్కా ఇళ్ల నిర్మాణ పథకాన్ని అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే రెండేళ్లలో అన్ని రకాల వౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఇటీవల జరిగిన బాలాజీ కెమికల్స్‌లో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.5 లక్షలు, యాజమాన్యం నుంచి ఒక్కో కుటుంబానికి రూ.15 లక్షలు నష్టపరిహారం అందజేస్తామని స్పష్టం చేశారు.
కుప్పకూలిన
సభావేదిక
*ఉప ముఖ్యమంత్రికి తప్పిన ప్రమాదం
ఉప ముఖ్యమంత్రి పి.పుష్పశ్రీవాణి బోగాపురం మండలం రాజపులోవ జంక్షన్ వద్దకు చేరుకున్నప్పుడు అక్కడ నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, వైసీపీ సీనియర్ నేత పి.సాంబశివరాజు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదిక వద్దకు మంత్రి రాగానే వైసీపీ సీనియర్ నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఆమెకు పుష్పగుచ్ఛాలను అందజేశారు. దీంతో పరిమితికి మించి ఎక్కువ మంది వేదికపై ఉండటంతో వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ సంఘటనలో ఆమెతోపాటు స్థానిక ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు తదితరులు కిందపడిపోయారు. అయితే వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆమెను సురక్షితంగా బయటకుతీశారు. ఆమెకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.