ఆంధ్రప్రదేశ్‌

హతోస్మి.. ఇదేం ‘వసతి’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, జూన్ 16: ఇంటర్మీడియట్ విద్యాభివృద్ధిలో భాగంగా ప్రైవేటు రెసిడెన్షియల్ పాఠశాలలకు దీటుగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతోప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు పేరుగొప్ప విద్యాసంస్థలుగా మిగిలిపోతున్నాయి. తరగతి గదులతోపాటు వసతి గృహాలు దయనీయంగా ఉండటంతో విద్యార్థులు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గుంటూరు జిల్లా నాగార్జునసాగర్‌లో విద్యార్థుల వసతి గదులు మురికికూపాలను తలపిస్తున్నాయి. దీనితో కొత్తగా చేరడానికి వస్తున్న విద్యార్థులు పలువురు అక్కడి పరిస్థితిని చూసి భయంతో తిరిగివెళ్లిపోతున్నారు. వివరాల్లోకి వెళితే... ఇంటర్ విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలను నిర్వహిస్తోంది. శ్రీకాకుళం జిల్లా తాటిపూడి (బాలికలకు ప్రత్యేకం), కృష్ణాజిల్లా నిమ్మకూరు గ్రామంలో కో-ఎడ్యుకేషన్, గుంటూరు జిల్లా మాచర్ల మండలం నాగార్జున సాగర్‌లో బాలుర, నెల్లూరు జిల్లా వెంకటగిరిలో బాలుర రెసిడెన్షియల్ కళాశాలలున్నాయి. ఏపీ రెసిడెన్షియల్ సెట్‌లో ర్యాంకులు సాధించిన వారికి ఈ కళాశాల్లో ప్రవేశానికి అర్హత లభిస్తుంది. ఈ ప్రవేశ పరీక్ష 150 మార్కులకు 10వతరగతి సిలబస్ ఆధారంగా ఉంటుంది. జనరల్ కేటగిరీలో 1000లోపు, బీసీ విద్యార్థులకు 1500లోపు, ఎస్సీ విద్యార్థులకు 2500లోపు ర్యాంకు వస్తేనే ఈకళాశాలలో చేరడానికి అవకాశం వస్తుంది. అంటే కేవలం మెరిట్ సాధించిన విద్యార్థులే ఈ కళాశాలల్లో చేరడానికి అర్హులు. ఈనాలుగు కళశాలల్లో నాగార్జున సాగర్ కళాశాల అంటే రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు ఉంది. ఎందుకంటే గతంలో ఇక్కడ కళాశాలలో చదివిన విద్యార్థులు ఎక్కువమంది ఐఏఎస్, ఐపీఎస్ వంటి సివిల్ సర్వీసు అధికారులుగా పనిచేసిన వారున్నారు. దీనితో నాగార్జునసాగర్ కళాశాలలో చేరడానికి పలువురు విద్యార్థులు ఆసక్తి కనపరుస్తుంటారు. అయితే ఇంత పేరున్న నాగార్జున సాగర్ కళశాలలో విద్యార్ధులకు వసతి సౌకర్యాలు దయనీయంగా ఉన్నాయి. విద్యార్థుల నివాసానికి రేకుల షెడ్లు ఏర్పాటుచేశారు. తిరిగీ తిరగని ఫ్యాన్లు, చెత్తతో నిండి గదులు మురికికూపాలను తలపిస్తున్నాయి. మరుగుదొడ్లను శుభ్రపరచకపోవడంతో దుర్గంధభూయిష్టంగా తయారయ్యాయి. దీనితో విద్యార్థులు నీళ్ల సీసాలతో ఆరుబయట బహిర్భూమికి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. పరిస్థితి ఇంత దయనీయంగా ఉన్నా ఎవరూ పట్టించుకోపోవడం విశేషం.
కాగా 2019-2020 సంవత్సరానికి జూనియర్ ఇంటర్‌లో ప్రవేశానికి మేలో ప్రవేశ పరీక్ష నిర్వహించారు. అర్హత సాధించిన విద్యార్ధులకు మే 29న గుంటూరులో కౌనె్సలింగ్ నిర్వహించారు. అక్కడ ఎంపికైన విద్యార్ధునుండి ఒరిజినల్ సర్టిఫెకెట్లు తీసుకుని రూ.2700 ఫీజు కట్టించుకుని జూన్ 6వ తేదీ నుంచి అడ్మిషన్లుకు రావాలని కాల్ లెటర్లు ఇచ్చారు. అయితే తదనంతరం ఎండ తీవ్రత కారణంగా జూన్ 13వ తేదీన అడ్మిషన్లు జరుగుతాయని వర్తమానం పంపించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు ఒక రోజు ముందుగా నాగార్జున సాగర్ చేరుకున్నారు. అయితే అడ్మిషన్లు పూర్తిచేసుకుని, వసతి గదుల వద్దకు విద్యార్థులతో కలిసి వెళ్లిన తల్లిదండ్రులకు తలతిరిగిపోయింది. వసతికి అపరిశుభ్రంగా ఉన్న రేకుల షెడ్లలో ఒక్కో గదిని ఆరుగురు విద్యార్థులకు కేటాయించారు. ఎవరి గదిని వారే శుభ్రపరుచుకోవాలని సూచించారు. మరుగుదొడ్ల వద్ద నీటి సదుపాయం లేక, దుర్గంధం వెదజల్లుతున్నాయి. ప్రవేశ పరీక్షలో ర్యాంకులు సాధించిన తమ పిల్లలకు మంచి సౌకర్యాలతో ప్రభుత్వం విద్యావకాశం కల్పిస్తుందని భావిస్తే, ఇంత దుర్భర పరిస్థితులు ఏమిటని తల్లిదండ్రులు కళాశాల సిబ్బందిని నిలదీశారు. ఇక్కడ సౌకర్యాలు ఇలానే ఉంటాయని, తామేమీ చేయలేమని వారు బదులిచ్చారు. దీనితో పలువురు విద్యార్థులను తల్లిదండ్రులు అడ్మిషన్లు రద్దుచేయించుకుని, వెనక్కు తీసుకువెళ్లిపోయారు. ఈ పరిస్థితిని చక్కదిద్దాలని విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
చిత్రం...అధ్వాన్నంగా ఉన్న విద్యార్థుల వసతి గది