ఆంధ్రప్రదేశ్‌

చౌక దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, జూన్ 16: చౌక దుకాణాల ద్వారా రేషన్‌కార్డుదారులకు అందజేస్తున్న దొడ్డురకాల బియ్యం స్థానంలో సన్నరకాల బియ్యం పంపిణీకి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రేషన్ దుకాణాల ద్వారా అందిస్తున్న బియ్యం తినేందుకు అనువుగా లేకపోవడంతో దొడ్డిదారిన హోటళ్లు, ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు. మరికొన్ని బియ్యం తిరిగి మిల్లులకు చేరుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. వాటినే సీఎంఆర్ కింద తిరిగి ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది మిల్లర్లు వీటిని మరోసారి రీసైక్లింగ్ చేసి మార్కెట్‌లో సన్నం బియ్యం పేర విక్రయిస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ప్రజలు మార్కెట్‌లో కొనుగోలు చేసి తింటున్న సన్నరకాల బియ్యాన్ని ఇకపై రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.
గ్రామాలు, మున్సిపాల్టీల్లో నియమింపబడుతున్న వలంటీర్ల ద్వారా నేరుగా లబ్ధిదారుల ఇళ్లకే బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించింది. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా దొడ్డురకాలకు చెందిన 1001 రకం బియ్యం సరఫరా అవుతోంది. ఈ ఖరీఫ్ నుంచి 1001 రకంపై ప్రభుత్వం నిషేధం విధించనున్నట్లు సమాచారం. ఈరకం బియ్యం స్థానంలో కొత్త సన్నరకాల బియ్యం సేకరించి రేషన్‌కార్డుదారులు, మధ్యాహ్న భోజనంలో బడిపిల్లలకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చౌకదుకాణాల ద్వారా సరఫరాచేసే బియ్యాన్ని ఇక నుంచి ప్రభుత్వం సొంతంగా రైతులు నిల్వ చేసిన గోదాముల నుండే సమకూర్చుకోనుంది. కొనుగోలు కేంద్రాల నుండి సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు అప్పగించి 67 శాతం బియ్యాన్ని వారి నుంచి తీసుకుంటారని సమాచారం. మరపట్టినందుకు మిల్లర్లకు చార్జీలు చెల్లిస్తారు. నూక, చీరు, తౌడు, పొళ్లు ఇతరత్రా ఉత్పత్తులను మిల్లులకే విడిచిపెడతారు. మిల్లుల నుంచి సేకరించిన బియ్యాన్ని పౌర సరఫరాల సంస్థ పౌరసరఫరాల శాఖకు అందిస్తుంది. ఈ సన్నబియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా వినియోగదారులకు అందిస్తారు. గతంలో మొత్తం బియ్యాన్ని మిల్లుల నుంచి ప్రభుత్వం ముక్కుపిండి తీసుకుంటూ ఉండేది. మిల్లర్లు ప్రభుత్వానికి సరఫరాచేసే లెవీ బియ్యం నాసిరకంగా ఉండేవి.
రాష్ట్రంలో పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాలతో పాటు సన్నరకాలు బియ్యం పండించే జిల్లాల నుంచి సేకరించే విషయంపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఏఏ జిల్లాల్లో ఎంతమేరకు నిల్వలున్నాయనే వివరాలు సేకరిస్తోంది. ప్రస్తుతం కడప జిల్లాలో 1001 రకం సాగుపై పూర్తిగా నిషేధం పెట్టారు. ఈ ఖరీఫ్‌లో స్వర్ణ, సాంబమసూరి తదితర సన్నరకాలు సాగుచేసేందుకు వీలుగా రైతులకు విత్తనం మొత్తంలో 40 శాతం రాయితీ ఇచ్చేవిధంగా అధికారులు చర్యలు తీసుకోనున్నారు.