ఆంధ్రప్రదేశ్‌

మహిళల భద్రతకు కఠిన చట్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 17: మహిళలు, చిన్నారుల భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటామని, ఇందులో భాగంగా కఠిన చట్టాలను తీసుకువస్తామని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనతి తెలిపారు. వెలగపూడి సచివాలయంలోని మూడో బ్లాక్‌లోని తన కార్యలయంలోకి సోమవారం లాంఛనంగా ఆమె ప్రవేశించారు. ఈసందర్భంగా మీడియాతో మాట్లాడుతూ శాఖ పనితీరు మరింత మెరుగు పరుస్తానన్నారు. మహిళలు, చిన్నారుల పట్ల అఘాయిత్యాలు, హత్యలు ఎక్కువగా జరుగుతున్నాయని, వీటికి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. అంగన్‌వాడీల వేతనాల పెంపుపై తొలిసంతకం చేశానని తెలిపారు.

చిత్రం...బాధ్యతలు స్వీకరిస్తున్న మంత్రి తానేటి వనిత