ఆంధ్రప్రదేశ్‌

ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గోదావరి మడ అడవులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 17: తూర్పు గోదావరిలోని కోరింగ వద్ద ఉన్న గోదావరి మడ అడవులకు ప్రపంచ హెరిటేజ్ సైట్‌గా గుర్తింపును తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. యునెస్కో గుర్తింపు పొందేందుకు వీలుగా నిర్ణీత నమూనాలో దరఖాస్తు చేసేందుకు, ఇతర ముందస్తు ఏర్పాట్లు చేసేందుకు వీలుగా నిపుణులతో కమిటీని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నియమించింది. 20 రకాల చెట్లు, 120 రకాల అరుదైన పక్షి జాతులకు ఈ మడ అడువులు నెలవు. పర్యాటకులు కూడా పెద్ద సంఖ్యలో వస్తుంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని దీనికి ప్రపంచ గుర్తింపును తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఏడు మంది సభ్యలతో ఒక కమిటినీ నియమించింది. రెండు నెలల్లోగా ఈ కమిటీ నివేదికను అందచేయాల్సి ఉంటుంది.