ఆంధ్రప్రదేశ్‌

కొత్త జిల్లాలు.. సర్కారుకు సవాలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూన్ 17: కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆదిలోనే ఆటంకం. అధికార పార్టీ నేతలే కొత్త జిల్లాల ఏర్పాటుకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విషయం విదితమే. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజే పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా కొత్త జిల్లాల ఏర్పాటుపై దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు. ఆ మేరకు కొత్త జిల్లాల ఏర్పాటుకు సర్వే పూర్తి చేశారు. ఏయే ప్రాంతాలను జిల్లా కేంద్రాలుగా ఏర్పాటు చేయాలన్న దానిపై తర్జనభర్జన పడ్డారు. చివరకు కొత్త జిల్లాల కేంద్రాలను కూడా ఎంపిక చేసినట్టు సమాచారం. ఆ విధంగా జిల్లాల పెంపుదల చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, జిల్లాల విభజనకు మాత్రం అధికార పార్టీ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. లోక్‌సభ నియోజకవర్గాలను ప్రామాణికంగా తీసుకుంటే తాము ప్రాధాన్యత గల ప్రాంతాలను కోల్పోవలసి వస్తుందని, దీనివల్ల పార్టీ శ్రేణుల్లో కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుందన్న అభిప్రాయాన్ని వారు వెల్లడించినట్టు సమాచారం.
ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని జిల్లాలు బాగా అభివృద్ధి చెందగా, మరికొన్ని జిల్లాలు బాగా వెనుకబడి ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో పారిశ్రామిక రంగం గణనీయంగా విస్తరించగా, మరికొన్ని జిల్లాల్లో పారిశ్రామికంగా వెనుకబడి ఉండటం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అంతంత మాత్రంగా ఉండటం వంటి అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకుంటే కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల తమ జిల్లాలు నష్టపోతాయని ఆయా జిల్లాల నేతలు అధినేత ముందు వాపోతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాలను విభజించడానికి అక్కడ నేతలు సుముఖంగా లేరు. శ్రీకాకుళం జిల్లాను విభజిస్తే ఆ జిల్లాకు చెందిన ఎచ్చెర్ల, రాజాం అసెంబ్లీల పరిధిలోని మండలాలు విజయనగరం జిల్లాలో విలీనం చేయాల్సి ఉంది. ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాలలో పరిశ్రమలు విస్తరించి ఉన్నాయి. దీంతో ఈ రెండు జిల్లాలను అక్కడ నుంచి వేరు చేయరాదని అక్కడ నేతలు ప్రభుత్వంపై వత్తిడి తెస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలోని అంబేద్కర్ యూనివర్శిటీ ఎచ్చెర్ల నియోజకవర్గం పరిధిలో ఉండగా, పరిశ్రమలు విస్తరించి ఉన్న కోష్ఠ, పైడిభీమవరం కూడా అదే నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. ఇక రాజాం అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. దీంతో ఆయా ప్రాంతాలను విలీనం చేయవద్దని అక్కడ నేతలు ప్రభుత్వంపై వత్తిడి తీసుకువస్తుండగా, ప్రకాశం జిల్లాలో కూడా ఆ జిల్లా విభజనపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లాను విభజిస్తే మర్కాపురాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని కొందరు, చీరాలను జిల్లా కేంద్రంగా చేయాలని మరి కొందరు, ఒంగోలు కేంద్రంగా ఏర్పాటు చేయాలని మరికొందరు ప్రభుత్వంపై వత్తిడి తెస్తున్నారు. ఈ విధంగా వివిధ జిల్లాల్లో కొత్త జిల్లాల ఏర్పాటుపై చాపకింద నీరులా ఉద్యమాలు మొదలయ్యాయి. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.