ఆంధ్రప్రదేశ్‌

సీఎం సహాయనిధిలో అక్రమాలు ఉంటే చెప్పండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 18: ముఖ్యమంత్రి సహాయనిధిలో గతంలో ఏవైనా అక్రమాలు జరిగితే ఆధారాలతో సహా తమ దృష్టికి తీసుకురావాలని శాసనసభాపతి తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు. శాసనసభలో మంగళవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో పాటు మరికొందరు వైసీపీ ఎమ్మెల్యేలు సీఎం రిలీఫ్ ఫండ్‌ను గత ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. దీనిపై స్పీకర్ స్పందిస్తూ అలాంటివి ఏవైనా ఉంటే తనకు వివరించాలని విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు.