ఆంధ్రప్రదేశ్‌

తెలంగాణకు ఆజ్యం పోసిందే వైఎస్‌ఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 18: ప్రత్యేక తెలంగాణకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆజ్యం పోశారని, ఇందులో భాగంగానే అప్పట్లో 42 మంది ఎమ్మెల్యేలను ఢిల్లీకి పంపారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. మంగళవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో సుపరిపాలన అందించామని తాము అవినీతికి పాల్పడి జగన్‌లా జైలుకెళ్లలేదని వ్యాఖ్యానించటంతో వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరువర్గాల సభ్యుల మధ్య వాగ్యుద్ధం నడిచింది. గవర్నర్ ప్రసంగం కట్టె..కొట్టె..తెచ్చె అనే చందంగా సాగిందని రాజమండ్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఆక్షేపించారు.
తొందరపడి ఒక కోయిల ముందే కూసిందన్నట్టుగా వైసీపీ సభ్యుల వ్యవహారశైలి ఉందన్నారు. నవరత్నాలకు నిధులెలా తెస్తారో గవర్నర్ ప్రస్తావించ లేదన్నారు. జగన్‌లా తమ పార్టీ అధినేత వారం వారం కోర్టు మెట్లెక్కటంలేదని వ్యాఖ్యానించారు.
తాము టీఏ, డీఏల కోసం రావటంలేదని, ప్రజా సమస్యలపై చర్చించేందుకు సమయం కేటాయించాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. వృద్ధిరేటు గురించిన ప్రస్తావన లేదన్నారు. గత ఐదేళ్లలో జాతీయ స్థాయి కంటే రాష్ట్ర వృద్ధిరేటు గణనీయంగా పెరిగిందని, గతంలో తమ ప్రభుత్వం అనుసరించిన అభివృద్ధి, సంక్షేమమే ఇందుకు నిదర్శనమన్నారు.
కృష్ణాడెల్టాకు వరప్రదాయిని అయిన పులిచింతల ఇప్పుడు తెలంగాణ అధీనంలో ఉందన్నారు. 2013 భూ సేకరణ చట్టం వల్లే పోలవరం ప్రాజెక్ట్ అంచనాలు రూ. 56 వేల కోట్లకు చేరాయన్నారు. ఆశా వర్కర్లకు టీడీపీ రూ 3వేల వేతనంతో పాటు 5వేల 500 ఇనె్సంటివ్‌గా అందించిందని, అయితే ప్రస్తుత ప్రభుత్వం రూ 10వేలు ఇనె్సంటివ్‌లతో కలిపి ప్రకటించిందా లేదా అనే విషయమై స్పష్టత రావాలన్నారు. పింఛన్లను రూ 3 వేలకు పెంచుతామని కేవలం రూ 250కు పెంచారని దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా రూ 10వేల కోట్లు ఐదేళ్లలో నష్టం కలుగుతుందని చెప్పారు.
సభను పక్కదారి పట్టిస్తున్నారు: అచ్చెన్నాయుడు
తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించి అమలు చేసిన రైతు రుణమాఫీ దేశంలో ఎక్కడాలేదని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు తెలిపారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలా చర్చ జరగటంలేదని, అధికార వైసీపీ సభ్యులు సభను పక్కదారి పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం సహకరించకపోయినా, రిజర్వు బ్యాంక్ స్పందించకపోయినా రుణమాఫీని చివరి వరకు చెల్లించామని తెలిపారు. పొరుగున ధనిక రాష్ట్రం తెలంగాణలోనే లక్ష రూపాయలు చెల్లిస్తే తమ ప్రభుత్వం లక్షన్నర ప్రకటించిందని గుర్తుచేశారు. సభలో అసత్యాలు వల్లించటం మంచి సాంప్రదాయం కాదన్నారు.
చిత్రం...అసెంబ్లీలో మాట్లాడుతున్న టీడీపీ ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరి, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు