ఆంధ్రప్రదేశ్‌

నవరత్నాలే వైసీపీని గెలిపించాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 18: వైసీపీ మేనిఫెస్టోలో పెట్టిన నవరత్నాలు తమను పైకెత్తగా, అదే విధంగా తొమ్మిది అంశాలు టీడీపీని తొక్కేశాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) పిల్లి సుభాష్ చంద్రబోస్ వ్యాఖ్యానించారు. శాసన మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే అంశంపై చర్చకు ఆయన మంగళవారం బదులిచ్చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాల మంజూరులో పారదర్శకత లేకపోవడం, జన్మభూమి కమిటీల అవినీతి నిలువునా టీడీపీని ముంచాయని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేల కొనుగోలు, చట్టాన్ని తుంగలోకి తొక్కడం, ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం, ఇసుక, మట్టి అక్రమాలు, డ్వాక్వా, రైతు రుణమాఫీ అమలు కాకపోవడం వంటివి ప్రజల్లో, రైతుల్లో టీడీపీ అంటే వ్యతిరేకతకు కారణమయ్యాన్నారు. 644 హామీల్లో 25 మాత్రమే అమలు చేయడం కూడా కారణమన్నారు. ఇవి టీడీపీ ఓటమికి నవ కారణాలని వ్యాఖ్యానించారు. ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని పథకాల రూపకల్పన చేస్తామన్నారు. రైతు రుణమాఫీ విషయంలో ఆడిన మాట తప్పడం వల్ల రైతుల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు. ఎడాపెడా హామీలు ఇవ్వడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఎమ్మెల్యేలు అక్రమ వ్యాపారాలకు, అవినీతికి పాల్పడినా చంద్రబాబు చూస్తూ ఊరుకున్నారన్నారు. అందుకే ఈ దుస్థితి టీడీపీకి వచ్చిందన్నారు. డ్వాకా రుణాలు చెల్లించకపోవడం వల్ల ఆ రుణాలు 14 వేల కోట్ల రూపాయల నుంచి 23 కోట్ల రూపాయలకు చేరుకుందన్నారు. ఎఫ్‌ఆర్‌ఎంబీ చట్టాన్ని ఉల్లంఘించారన్నారు. డిస్కమ్‌లకు చెల్లింపులు నిలిపివేశారన్నారు. సాంకేతిక పరిజ్ఞానం పేరుతో రైతుల భవితను కంప్యూటర్ ఆపరేటర్ల చేతుల్లో పెట్టారన్నారు. వెబ్‌ల్యాండ్‌లో తమ భూమి ఉందో లేదో రోజూ చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి త్వరలోనే షెడ్యూల్ ఇస్తామన్నారు.

బొత్స, జనార్దన్‌ల మధ్య వాగ్వాదం
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ శాసన మండలిలో చేసిన తీర్మానం సందర్భంగా టీడీపీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్, మంత్రి బొత్స మధ్య వాగ్వివాదం జరిగింది. హోదా కోసం పోరాటం చేస్తున్నామనే వైకాపా, వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి గా ఎన్నిక సందర్భంలో ఎందుకు బీజేపీకి మద్దతు పలికిందని జనార్దన్ ప్రశ్నించారు. రాజ్యాంగ పదవులకు పోటీ లేకుండా ఏకగ్రీవం అయ్యేందుకు సహకరించానేది తమ పార్టీ నిర్ణయమని బొత్స వివరించారు.
హోదా కోసం వైసీపీ ఎంపీలు తమ పదవులను తృణప్రాయంగా వదిలేశారని గుర్తు చేశారు. దీనిపై జనార్దన్ స్పందిస్తూ, నాలుగు సంవత్సరాలు అన్నీ అనుభవించి, ఎన్నికల ముందు రాజీనామా చేశారని ఎద్దేవా చేశారు. ఈ దశలో చైర్మన్ షరీఫ్ జోక్యం చేసుకుని సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి, వివాదానికి తెరదించారు.
అంతకు ముందు కె.సత్యనారాయణ రాజు మాట్లాడుతూ ఎన్నికల్లో ధనం, కుల ప్రభావం పెరిగిందన్నారు. ముఖ్యమంత్రి జగన్‌కు కొంత సమయం ఇవ్వాలని లేకుంటే, మండలి లేకుండా రద్దు చేస్తామని హెచ్చరించడం గమనార్హం.