ఆంధ్రప్రదేశ్‌

తలనీలాల గోడౌన్లవద్ద సీసీ కెమెరాల నిఘా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 18: ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి మొక్కులు తీర్చుకోవడంలో భాగంగా భక్తులు సమర్పించే తలనీలాల ద్వారా ఏటా సుమారు 120 కోట్ల రూపాయల మేర టీటీడీకి ఆదాయం లభిస్తోంది. ఈ నేపథ్యంలో తలనీలాలను నిల్వ ఉంచే గోడౌన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పర్యవేక్షించే ఏర్పాట్లను టీటీడీ చేస్తోంది. తిరుమలలో తలనీలాలు సమర్పించడాన్ని భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఇందుకు అనుగుణంగా తిరుమలలో ప్రధాన కళ్యాణకట్టతో పాటు మినీ కళ్యాణకట్టల్లో యాత్రికులు ఉచితంగా తలనీలాలు సమర్పించేలా టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది. అంతేగాక యాత్రికులు భక్తితో సమర్పించిన తలనీలాలను టీటీడీ ప్రత్యేక శ్రద్ధతో సేకరించి నిల్వ చేస్తోంది. తిరుపతిలోని హరేరామ ఆలయం రోడ్డులో గల గోడౌన్‌లో ఈ తలనీలాలను మూడు రకాలుగా నిల్వ చేస్తారు. 24గంటల పాటు భద్రతా సిబ్బంది విధుల్లో ఉంటారు.
ఈ తలనీలాలను పర్యవేక్షణకు మరింత దృష్టిసారించిన టీటీడీ ప్రతిరోజు తిరుమల నుండి తలనీలాలను తిరుపతికి తరలించేలా ఏర్పాట్లు చేసింది. ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల నిఘాలో తలనీలాలను ఆరబెట్టి భద్ర పరిచే విధంగా చర్యలు చేపట్టారు. తలనీలాలను వేరుచేయడం, ఆరబెట్టడం తదితర పనులు చేసేందుకు రోజు 70మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. టీటీడీ జనరల్ మేనేజర్(వేలం) నాగేశ్వర్‌రావు, డిప్యూటీ జనరల్ మేనేజర్ (వేలం) సత్యం పర్యవేక్షణలో గోడౌన్ కార్యకలాపాలు కట్టుదిట్టంగా సాగుతున్నాయి. ఇకపై సీసీ కెమెరాలు మరింత పెంచి తలనీలాల పర్యవేక్షణ మరింత పెంచేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది.