ఆంధ్రప్రదేశ్‌

రైల్వేలో సీక్రెట్ పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 19: భారతీయరైల్వేలో సీక్రెట్ పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలు జరుగనున్నాయి. ప్రతిష్టాత్మకంగా జరుగనున్న ఈ ఎన్నికలను భద్రత మధ్య నిర్వహించాలని రైల్వేబోర్డు నిర్ణయించింది. వీటిని ఆగస్టు 26, 27, 28 తేదీల్లో నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకు రైల్వేలో ఉన్న కార్మిక సమాఖ్యలకు కార్మిక మంత్రిత్వశాఖ నుంచి లేఖలు అందాయి. రైల్వేబోర్డు నిర్వహించే ఎన్నికలకు సంబంధించి సన్నద్ధం కావాల్సిందిగా ఈ లేఖలో పేర్కొంది. దీంతో రైల్వేలో ఉన్న గుర్తింపు కార్మిక సంఘాలు ఎన్నికల ప్రచారాన్ని ఆరంభించాయి. భారతీయరైల్వే పరిధిలో రైల్వే జోన్లు, 48 డివిజన్లు ఉండగా, ప్రతి చోట సీక్రెట్ పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలు జరుగుతాయి. దీనికి ప్రతి రైల్వే కార్మికుడు, ఉద్యోగులు తమ గుర్తింపు కార్డును చూపి ఓటు వేస్తారు. ప్రతి అయిదేళ్ళకోసారి నిర్వహించే ఈ ఎన్నికల్లో ఇప్పటివరకు ఆలిండియా రైల్వే కార్మికుల సమాఖ్య (ఏఐఆర్‌ఎఫ్) కొన్నిచోట్ల గుర్తింపు పొందగా, మిగిలిన చోట్ల నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వే (ఎన్‌ఎఫ్‌ఐఆర్) అధిక్యత సాధించింది. కనీసం 35 శాతం ఓట్లు పొందగలిగిన కార్మిక సంఘానికే రైల్వేబోర్డు నుంచి గుర్తింపు లభిస్తుంది.
కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ‘సింగిల్ యూనియన్ - సింగిల్ ఇండస్ట్రీ’ నినాదంతో రైల్వే కార్మికుల గుర్తింపు సంఘాలకు ఎన్నికలు నిర్వహించేవారు. ఈవిధంగా కాంగ్రెస్ హయాంలో రెండుసార్లు, బీజేపీ వచ్చిన తరువాత ఒకసారి గుర్తింపు సంఘ ఎన్నికలు జరిగాయి. ఇప్పటికీ ఇదే విధానం కొనసాగుతుండగా ప్రస్తుతం అధికారంలోకి ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుసరించే విధాన నిర్ణయాల మేరకు ఈసారి ఎన్నికలు ఉండవచ్చని కార్మిక వర్గం భావిస్తోంది. తొలి నుంచి ఉన్న 35శాతం ఓట్లకు సంబంధించి కూడా మార్పులు ఉండవచ్చనే సంకేతాలు వస్తున్నాయి. ఈసారి 20శాతం సాధించగలిగే కార్మిక సంఘానికి గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నట్టు ఈ విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉందని కూడా కార్మికవర్గాల్లో చర్చనీయాంశమైంది. గుర్తింపు పొందిన తరువాత కార్మిక సంఘాల ప్రతినిధులు, తమ వెంట ఉండే కార్యవర్గం కలిపి విధులకు డుమ్మా కొడుతూ రైల్వేశాఖకు నష్టం కలిగిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కార్మికులు ఎదుర్కొనే సమస్యలకు ఏళ్ళ తరబడి పరిష్కారం దొరక్కపోగా, విరాళాల వసూళ్లతో దోపిడికి గురిచేస్తున్నారనే విమర్శలు కార్మిక వర్గం నుంచి వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఈసారి సీక్రెట్ పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలకు తీసుకునే కీలక నిర్ణయాలపైనే గుర్తింపు కార్మిక సంఘాల్లో ఉత్కంఠ నెలకొంది. అన్నివిధాలా ఈసారి రైల్వేలో జరుగుతున్న గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికలు కీలకం కానున్నాయి. కొనే్నళ్ళుగా రైలు చార్జీలు పెరగకపోవడం, మరోపక్క కీలకమైన రైల్వే విభాగాల్లో పోస్టుల భర్తీ జరగకపోవడం, ఏడవ వేతన సవరణకు సంబంధించి అసమానతలను ఇంకా తొలగించకపోవడం, పాత పెన్షన్ విధానం కొనసాగింపుపైన రైల్వేబోర్డు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంపట్ల గుర్తింపు సంఘాలు మండిపడుతున్నాయి. 1974లోనే జార్జిఫెర్నాండేజ్ నాయకత్వంలో జరిగిన సమ్మె తప్పితే తరువాత ఇప్పటివరకు రైల్వేలోనే సమ్మె అనేదే లేకపోవడంపట్ల కార్మికులు తప్పుబడుతున్నారు. ఈవిధంగా రైల్వేపరంగా, గుర్తింపు కార్మిక సంఘాల తరపున ఉన్న వైఫల్యాల నేపధ్యంలో ఈ ఎన్నికలు కీలకం కానున్నాయి.
గట్టి భద్రత మధ్య నిర్దేశించిన తేదీల్లో జరుగనున్న ఎన్నికలకు సంబంధించి జోన్లు, డివిజన్ల స్థాయిలో సంఘాల నేతలు విస్తృతంగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆయా బ్రాంచీల్లో ఎన్నికల సందడి ప్రారంభమైంది.