ఆంధ్రప్రదేశ్‌

సింహాచలేశుని సన్నిధిలో ‘నృసింహ సేవాదళం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, ఆగస్టు 8: భక్తుల సేవే భగవంతుడి సేవగా భావించి భక్తితో, బాధ్యతతో విధులు నిర్వహించాలని స్వచ్ఛంద సేవకులకు దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె. రామచంద్రమోహన్ పిలుపునిచ్చారు. దేవాలయాల్లో స్వచ్ఛంద సేవకుల భాగస్వామ్యాన్ని పెంచాలన్న ప్రభుత్వ లక్ష్యం మేరకు సింహాచలం దేవస్థానం ప్రయోగాత్మకంగా తొలిసారిగా నృసింహ సేవాదళం పేరుతో ఒక వ్యవస్థ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. స్వచ్ఛంద సేవకుల నుండి ఆన్‌లైన్‌తో పాటు నేరుగా దరఖాస్తులను స్వీకరించి సేవాదళాన్ని ఏర్పాటు చేసుకుంది. సోమవారం తొలివిడతగా 206 మంది సేవకులకు ఈవో రామచంద్రమోహన్, రాష్ట్ర ప్రభుత్వ ఆగమ సలహా మండలి సభ్యుడు, సింహాచల క్షేత్ర విశ్రాంత ప్రధానార్చక పురోహితుడు శ్రీమాన్ మోర్త సీతారామాచార్యులు గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఈవో సేవాదళం ప్రతినిధులతో మాట్లాడారు. దేవస్థానం ఉద్యోగులతో సమానమైన బాధ్యత, గౌరవం సేవాదళ సభ్యులకు ఇస్తామన్నారు. జట్లు జట్లుగా సేవకులను ఉపయోగించుకుంటామన్నారు. దేవస్థానానికి వచ్చే భక్తులకు వివిద రూపాల్లో సేవలు అందించాల్సి ఉంటుందని, ఏఏ రోజుల్లో ఎవరెవరు? సేవల్లో పాల్గోవాలన్న వివరాలను త్వరలోనే ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. భక్తుల పట్ల ప్రవర్తించాల్సిన తీరుతెన్నులను ఆయన సేవాప్రతినిధులకు వివరించారు.

చిత్రం.. సేవకులకు గుర్తింపు కార్డులు అందజేస్తున్న ఈవో