ఆంధ్రప్రదేశ్‌

అడుగంటిన తుంగభద్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బళ్లారి, జూన్ 21: కర్నాటక, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల రైతుల జీవనాడి అయిన తుంగభద్రలో నీరు అడుగంటిపోయింది. దీంతో రైతులు, ప్రజల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. ఎగువ ప్రాంతాల్లో వర్షం జాడలేకపోవడంతో చుక్క నీరు కూడా జలాశయానికి చేరడం లేదు. గత ఏడాది ముందస్తు వర్షాలు కురవడంతో ఇదే సమయానికి జలాశయానికి 25 టీఎంసీలకుపైగా నీరు చేరింది. 7073 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. అయితే ఈసారి పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. రుతుపవనాలు ఆలస్యం కావడంతో జలాశయం ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురవలేదు. దీంతో ఇన్‌ఫ్లో లేక జలాశయం ఎండిపోయింది. వాన జాడ లేకపోవడంతో ఆయకట్టుకు నీరు అందే పరిస్థితి కనిపించడం లేదు. తాగేందుకైనా నీరు లభిస్తుదా అని ప్రజలు వరుణుడి కరుణ కోసం ఎదురుచూస్తున్నారు.