ఆంధ్రప్రదేశ్‌

అందరికీ ఆరోగ్య సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 20: రాష్ట్రంలో అందరికీ ఆరోగ్య సేవలు పూర్తిస్థాయిలో అందేలా సమగ్ర నివేదిక తయారు చేయాల్సిన బాధ్యత తమపై ఉందని ఆరోగ్య సంస్కరణలపై ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ చైర్‌పర్సన్ సుజాతారావు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో ఈ కమిటీ తొలి సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా నవరత్నాల్లో భాగంగా చేపట్టే ఆరోగ్య సేవలు, ఆరోగ్యశ్రీ తదితర పథకాలపై చర్చించారు. ఆరోగ్యశ్రీ అమలుకు కావాల్సిన నిధులు, రాష్ట్ర బడ్జెట్‌పై పడే భారం తదితర అంశాలను చర్చించారు. జిల్లా స్థాయి ప్రభుత్వ ఆసుపత్రుల్లో నెల రోజుల పాటు కేసుల నమోదును పరిశీలించి, ఎంత ఖర్చు అవుతుందో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని ఆదేశించారు. ఆరోగ్యమిత్రల వల్ల ఉన్న ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. వారి సేవలను విస్తరించాలన్నారు. బెంగళూరు, చెన్నైలో ఈపథకం అమలుపై చర్చించారు. 104, 108వాహనాల సేవలను పూర్తి స్థాయిలో అమలుకు మార్గాలను సూచించాలన్నారు.