ఆంధ్రప్రదేశ్‌

టీడీపీ ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 20: తెలుగుదేశం పార్టీ అవిర్భావం తర్వాత ఎన్నో ఒడిదుడుకులు, సంక్షోభాలను ఎదుర్కొందని తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. మొదటి నుంచి పార్టీకి వెన్నంటి ఉంది కార్యకర్తలేనని, నాయకులు పార్టీలు మారుతున్నా కార్యకర్తలు మాత్రం పార్టీ కోసం సైనికుల్లా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. గురువారం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఆయన బహిరంగ లేఖ రాశారు. 1983లో పార్టీని స్థాపించిన 9 నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, తరువాత కొద్దికాలానికే నాదెండ్ల భాస్కరరావుతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారినా తిరిగి అఖండ మెజార్టీతో పార్టీ ఘన విజయం సాధించిందన్నారు. 1988-89 కాలంలో ఎందరో నాయకులు పార్టీ మారారని, 1994లో సంక్షోభాలను ఎదుర్కొని తిరిగి పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. అధికారంలో ఉన్న సమయంలోనూ ముఖ్య నేతలు హత్యలకు, ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయారన్నారు. 2004 నుండి పదేళ్లు అధికారాన్ని కోల్పోయినా 2014లో తిరిగి అధికారంలోకి వచ్చిందన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ప్రజలు అనుభవజ్ఞుడైన చంద్రబాబుకే పట్టం కట్టారని గుర్తు చేశారు. 2019 ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయామని, ఏది ఏమైనా ఇప్పటివరకు దాదాపు 300 మంది నాయకులు తెలుగుదేశం పార్టీని వీడి, ఇతర పార్టీల్లో చేరి కీలక పదవులు అనుభవిస్తున్నారన్నారు. టీడీపీ నుండి వెళ్లిన తమ్మినేని సీతారామ్ నేడు రాష్ట్ర శాసనసభ స్పీకర్‌గా ఉన్నారని, అలాగే పార్టీని వీడిన కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారన్నారు. మరో నేత నామా నాగేశ్వరరావు టీఆర్‌ఎస్ లోక్‌సభ పక్షనేతగా ఉన్నారన్నారు. ఇలాంటివారు ఎందరో ఉన్నారని, ఎవరు వెళ్లినా కొత్త నాయకులను తయారు చేసుకునే సత్తా పార్టీకి ఉందని స్పష్టం చేశారు.