ఆంధ్రప్రదేశ్‌

ప్రజలకు వద్దకు మళ్లీ మళ్లీ వెళ్లాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 20: ప్రజాభిమానం సంపాదించాలంటే మళ్లీమళ్లీ ప్రజల వద్దకు వెళుతూనే ఉండాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి ఊమెన్‌చాందీ అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులతో స్థానికంగా గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చాందీ మాట్లాడుతూ అధికారపక్షం కన్నా ప్రతిపక్షానికే ప్రజల వద్దకు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. కేరళలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో తాము అదే చేశామని, ప్రజలు గుర్తించి మొత్తం 20 స్థానాల్లో గెలిపించారన్నారు. పీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి మాట్లాడుతూ మొదట అభ్యర్థులందరికీ ధన్యవాదాలు తెలిపారు. గెలవమని తెలిసినా అందరూ ధైర్యంతో పోటీలో ఉన్నారని పేర్కొన్నారు. పార్టీ నుంచి కొంత సహాయం అందినా సొంత ఖర్చుతో ఎన్నికల్లో నిలబడిన మనోధైర్యాన్ని అభినందించారు. గత ఐదేళ్లలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు 1700 రోజులు రోడ్డుమీదే ఉన్నామన్నారు. ప్రజల్లోకి కాంగ్రెస్‌ను తీసుకువెళ్లగలిగామని ప్రత్యేక హోదా కాంగ్రెస్ వల్లే వస్తుందనేది వారికి విశ్వాసం కల్పించామని, కానీ వాటిని ఓట్లుగా మలుచుకోలేకపోయా మన్నారు. ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శులు డాక్టర్ ప్రసాద్, గిడుగు రుద్రరాజు, మెయ్యప్పన్, క్రిష్ట్ఫోర్ తిలక్, శైలజానాథ్, మస్తాన్‌వలి, ఏఐసీసీ నేత కె రాజు, పీసీసీ ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, జిల్లా ఇన్‌ఛార్జిలు, తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలువురు ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు పార్టీ బలోపేతానికి తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా 5 తీర్మానాలను సమావేశంలో ఆమోదించారు. రాహుల్‌గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడుగా కొనసాగాలని, రాజీనామాను ఉపసంహరించుకుని ఈ కష్ట సమయంలో పార్టీని నడిపించాలని, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల విద్వేష రాజకీయాలను ఓడించేందుకు సైద్ధాంతిక పోరాటానికి పార్టీని పటిష్టపర్చి స్థానిక ఎన్నికలకు సిద్ధం కావల్సిందిగా తీర్మానించారు. రుణమాఫీ రైతు బకాయిలను రూ.8353 కోట్లను నూతన ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అనంతరం జరిగిన పీసీసీ కార్యవర్గ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి కొనసాగాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. పార్టీ పటిష్టత కోసం జిల్లాల్లో ఖాళీగా ఉన్న పదవులను భర్తీ చేయడం, స్థానిక ఎన్నికలకు సిద్ధం కావడం అంశాలపై చర్చ జరిగింది.

చిత్రం...సమావేశంలో మాట్లాడుతున్న ఊమెన్‌చాందీ, పక్కన పీసీసీ అధ్యక్షుడు రఘువీరా, తదితరులు