ఆంధ్రప్రదేశ్‌

కేసుల నుండి బయటపడేందుకే చంద్రబాబు కుయుక్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, జూన్ 20: ఓటకు నోటు, అక్రమాస్తుల కేసుల నుంచి బయటపడేందుకు చంద్రబాబునాయుడు కుయుక్తులు, కుట్రలు పన్నుతున్నారని వైసీపీ అధికార ప్రతినిధి సీ.రామచంద్రయ్య ఆరోపించారు. అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులను చంద్రబాబునాయుడే బీజేపీలోకి పంపారని అన్నారు. కడప నగరంలో గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పార్టీ ఎంపీలను బీజేపీలోకి పంపేందుకే విదేశీ పర్యటనకు వెళ్లారన్నారు. గడిచిన ఐదేళ్లలో అక్రమార్జన ద్వారా కూడబెట్టుకున్న ఆస్తులను రక్షించుకునేందుకు, అక్రమార్జనపై కేసులు లేకుండా చూసుకునేందుకు చంద్రబాబునాయుడు ఇలాంటి కుయుక్తులు పన్నుతున్నారని అన్నారు. అందులో భాగంగానే పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి సాగనంపారని విమర్శించారు. ఇతర పార్టీల నుంచి ఎంపిలను చేర్చుకునే విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ పునరాలోచించాలని రామచంద్రయ్య సూచించారు. ప్రజాస్వామ్యం మనుగడలో ఉండాలంటే, అక్రమాలు, అవినీతిపరులను పార్టీలో చేర్చుకోకుండా దూరంగా ఉంచాలన్నారు. అంతేగాక వారి అవినీతిపై విచారణ జరిపించాలన్నారు. అప్పుడే ప్రజలకు ప్రజాస్వామ్యంపై విశ్వాసం కలుగుతుందని సీఆర్‌సీ అన్నారు. పార్టీలో చేర్చుకునే ముందు పదవులకు రాజీనామాలు చేసి రావాలని బీజేపీ చెబితే సబబుగా ఉంటుందని ఆయన సూచించారు. వైసీపీలోకి ఎవరు రావాలన్నా తొలుత పదవులకు రాజీనామా చేయాలనే నియమం ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఏర్పాటు చేసుకున్నారని, ఇటువంటి నియమనిబంధనలను అన్ని పార్టీలు విధించుకుంటే ప్రజాస్వామ్యానికి మనుగడ ఉంటుందని పేర్కొన్నారు. చంద్రబాబునాయుడు అవినీతి భాగోతాలు ఒక్కొక్కటే బయటపడుతున్న సమయంలో తన అనుచర వర్గాలను కాపాడుకునే ప్రయత్నంలోనే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలోకి పంపుతున్నారన్నారు. బీజేపీ అధిష్టానం ఇది గుర్తించాలని ఆయన సూచించారు.
చిత్రం...కడపలో విలేఖరులతో మాట్లాడుతున్న వైసీపీ అధికార ప్రతినిధి సీ.రామచంద్రయ్య